West Bengal: మమత మేనల్లుడి కోటకు బీటలు.. ఫల్తాలో భారీ విజయం దిశగా బీజేపీ..
- ఫల్తా రీపోలింగ్‌లో బీజేపీ భారీ ఆధిక్యం.. టీఎంసీ కంచుకోటలో కమల వికాసం.. నాలుగో స్థానంలో టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: పశ్చిమ బెంగాల్లో వివాదాస్పద ఫల్తా నియోజకవర్గం రీ-పోలింగ్ ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ నియోజకవర్గంలో బీజేపీ భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు ఎంపీ అభిషేక్ బెనర్జీ కంచుకోటగా ఉన్న ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఘోర ఓటమి దిశగా వెళ్తోంది. ఎన్నికల ఓటింగ్‌కు ముందే పోటీ నుంచి టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ పోటీ నుంచి వైదొలిగినట్లు ప్రకటించాడు. ఈ ఎన్నికల్లో టీఎంసీ నాలుగో స్థానంలో ఉంది. గత 15 ఏళ్లుగా టీఎంసీ కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతంలో ఇప్పుడు టీఎంసీ బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్ తర్వాత స్థానంలో నిలిచింది.
ఫల్తాలో తొమ్మిదో రౌండ్ ముగిసే సరికి బీజేపీ అభ్యర్థి దేబాంశు పాండా 34,000కు పైగా ఓట్ల భారీ ఆధిక్యాన్ని సాధించారు. రౌండ్ రౌండ్‌కు బీజేపీ తన అధిక్యాన్ని పెంచుకుంటూ పోతోంది. మొత్తం 21 రౌండ్ల తర్వాత మెజారిటీపై స్పష్టత వస్తుంది. ఇప్పుడున్న ట్రెండ్ చూస్తే బీజేపీకి భారీ విజయం ఖాయంగా కనిపిస్తోంది. అభిషేక్ బెనర్జీకి సన్నిహిత సహచరుడి ఉన్న జహంగీర్ ఖాన్ కేవలం 2570 ఓట్లు సాధించారు.
Also Read
- DU Student Harassment: ‘అర్బన్ మైండ్‌సెట్’ టీ-షర్ట్‌పై కామెంట్స్. DU విద్యార్థినిని SUVతో వెంబడించిన యువకులు
- Tamil Nadu: బంగారం, డబ్బులు ఎక్స్పోజ్ చేస్తూ రీల్స్.. వీడియోలు చూసి కేజీ గోల్డ్, భారీగా డబ్బు కొట్టేసిన దొంగలు..
- CBSE Gets New Chairman: CBSEకి కొత్త ఛైర్మన్.. ఎవరీ మందీప్ భండారీ?.. పూర్తి వివరాలు ఇవే
- AFSPA Extension: మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్‌లో.. AFSPA మరో ఆరు నెలలు పొడిగింపు
అభిషేక్ కోటకు బీటలు:
బెంగాల్ టీఎంసీ దారుణమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. పార్టీ నేతలు ఇప్పటికే మమతా బెనర్జీపై తిరుగుబాటు స్వరాలు వినిపిస్తున్నారు. గత 15 ఏళ్లుగా నడిచిన తృణమూల్ అరాచకాలపై సాధారణ ప్రజలు కూడా తిరగబడుతున్నారు. కొత్తగా ఎన్నికైన సీఎం సువేందు అధికారి ప్రభుత్వం టీఎంసీ గుండాలపై ఉక్కుపాదం మోపుతోంది. ఎన్నికల అక్రమాలకు అడ్డాగా ఉన్న ఫల్తాలో రీపోలింగ్‌కు ఈసీ ఆదేశాలు ఇవ్వడంతో టీఎంసీలో ఓటమి భయం మొదలైంది.
ఇక ఎంపీ అభిషేక్ బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న డైమండ్ హార్బర్ ఎంపీ సీటు పరిధిలోనే ఫల్తా నియోజకవర్గం ఉంటుంది. ఈ ప్రాంతంలో టీఎంసీ ఓటమి వచ్చే పార్లమెంట్ స్థానంపై ఖచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తుంది. దీనికితో తోడు తాను నమ్మినబంటుగా ఉన్న జహంగీర్ ఖాన్ ఓటమి కూడా వచ్చే ఎన్నికల్లో తప్పకుండా నెగిటివ్‌గా మారుతుంది. టీఎంసీలో మమత తర్వాత నెంబర్ 2గా ఉన్న అభిషేక్‌ను దెబ్బతీయడం బీజేపీకి చాలా అవసరంగా భావిస్తోంది.
తాజావార్తలు
-
Chiranjeevi: చిరూ లీక్స్ మెగా జోష్.. కాకా షూటింగ్ గురించి మాస్ లీక్ ఇచ్చిన మెగాస్టార్!
-
TGTET Results 2026: తెలంగాణ ఇన్-సర్వీస్ ఫలితాలు విడుదల.. 70 శాతం దాటిన ఉత్తీర్ణత..!
-
Dancers Association Dispute: డాన్సర్స్ అసోసియేషన్‌లో విభేదాలు.. అక్టోబర్ 11న ఎన్నికలు
-
TRAI Internet TV Rules: TRAI కొత్త రూల్స్.. ఇంటర్నెట్లో ఫ్రీగా టీవీ ఛానెళ్లను చూడటం ఇక కష్టమేనా?
-
Nursing Home Seized: వారం రోజుల్లో ఇద్దరు మృతి.. తిరువూరు నర్సింగ్ హోమ్ సీజ్..!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?