Chiranjeevi: చిరూ లీక్స్ మెగా జోష్.. కాకా షూటింగ్ గురించి మాస్ లీక్ ఇచ్చిన మెగాస్టార్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సీజన్ అంటేనే పూనకాలు. ఆ పండక్కి మెగాస్టార్ చిరంజీవి థియేటర్లలోకి అడుగుపెడుతున్నారంటే ఆ సందడే వేరు. యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా అత్యంత ప్రతిష్టాత్మక తెరకెక్కుతున్న చిత్రం కాకా. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి సినీ ప్రియులకు ఊపునిచ్చే అప్డేట్ తాజాగా మెగా బాస్ పంచుకున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ సంక్రాంతి సమరానికి సకల సన్నాహాలు చేసుకుంటోంది.
సాధారణంగా పెద్ద సినిమాల నిర్మాణం సుదీర్ఘకాలం సాగుతుంది, కానీ ‘కాకా’ టీమ్ మాత్రం ఊహించని వేగంతో రిలీజ్ డేట్ వరకు రెడీ కావడానికి దూసుకుపోతోంది. తాజాగా నిర్వహించిన సిగ్మా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి కాకా గురించి అదిరిపోయే అప్డేట్ను అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ మాట్లాడుతూ.. కాకా సినిమాకు సంబంధించిన ఫస్ట్ హాఫ్ టాకీ పార్ట్ షూటింగ్ ఇప్పటికే పూర్తిగా కంప్లీంట్ అయ్యిందన్నారు. సెకండ్ హాఫ్‌లో కూడా ఇప్పటికే 30 శాతం కీలక సన్నివేశాల చిత్రీకరణ ముగిసిందని చెప్పారు. ఒకవైపు షూటింగ్ సాగుతుండగానే, మరోవైపు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.తమన్ ఫస్ట్ హాఫ్‌కు సంబంధించిన BGM వర్క్ స్టార్ట్ చేసినట్లు చెప్పారు. ఈ మెగా అప్డేట్తో ఫ్యాన్స్ మస్త్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం కాకా చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు, మ్యూజిక్ వర్క్స్ రెండు సమాంతరంగా జరుగుతుండటం చిత్ర నిర్మాణంలో టీమ్ చూపిస్తున్న స్పష్టమైన ప్రణాళికను తెలియజేస్తోందని అంటున్నారు. బాబీ రాసుకున్న స్క్రిప్ట్‌కు తగ్గట్టుగా మెగాస్టార్ చిరంజీవి మార్క్ మాస్ ఎలిమెంట్స్‌కు తమన్ ఇచ్చే రీ-రికార్డింగ్ థియేటర్లలో దుమ్మురేపడం ఖాయంగా కనిపిస్తోందని చెబుతున్నారు.
Also Read
- Dancers Association Dispute: డాన్సర్స్ అసోసియేషన్‌లో విభేదాలు.. అక్టోబర్ 11న ఎన్నికలు
- Nani The Paradise Box Office: ‘ది ప్యారడైజ్’ రికార్డు.. నాని కెరీర్లో ఫాస్టెస్ట్ రూ.100 కోట్ల సినిమా..!
- Avengers Endgame Encore: బాహుబలి రికార్డు బద్దలు.. ఇండియాలో సరికొత్త చరిత్ర సృష్టించిన హాలీవుడ్ మూవీ..!
- Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
పండగ సందడి మొదలయ్యే జనవరి 13న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ జోరుగా సన్నాహాలు చేస్తున్నాయి. గతంలో చిరంజీవి – బాబీ కాంబినేషన్లో వచ్చిన వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేయడంతో, ఇప్పుడు వస్తున్న ‘కాకా’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే సగానికి పైగా పనులు పూర్తవడం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగవంతం కావడంతో సంక్రాంతి రేసులో మెగాస్టార్ సినిమా ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Chiranjeevi: చిరూ లీక్స్ మెగా జోష్.. కాకా షూటింగ్ గురించి మాస్ లీక్ ఇచ్చిన మెగాస్టార్!
-
TGTET Results 2026: తెలంగాణ ఇన్-సర్వీస్ ఫలితాలు విడుదల.. 70 శాతం దాటిన ఉత్తీర్ణత..!
-
Dancers Association Dispute: డాన్సర్స్ అసోసియేషన్‌లో విభేదాలు.. అక్టోబర్ 11న ఎన్నికలు
-
TRAI Internet TV Rules: TRAI కొత్త రూల్స్.. ఇంటర్నెట్లో ఫ్రీగా టీవీ ఛానెళ్లను చూడటం ఇక కష్టమేనా?
-
Nursing Home Seized: వారం రోజుల్లో ఇద్దరు మృతి.. తిరువూరు నర్సింగ్ హోమ్ సీజ్..!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?