TGTET Results 2026: తెలంగాణ ఇన్-సర్వీస్ ఫలితాలు విడుదల.. 70 శాతం దాటిన ఉత్తీర్ణత..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TGTET Results 2026: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ, ఎయిడెడ్, స్థానిక సంస్థల పాఠశాలల్లో పనిచేస్తున్న ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన టీజీటెట్-ఇన్‌సర్వీస్ టీచర్స్-2026 ఫలితాలు విడుదలయ్యాయి. జులై 21న విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల (సెప్టెంబర్) 8, 9 తేదీల్లో మూడు విడతల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) పద్ధతిలో ఈ పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 24,986 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 22,477 మంది (24 వేల మందికి పైగా) పరీక్షకు హాజరయ్యారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, టీజీటెట్ ఛైర్పర్సన్ నవీన్ నికోలస్ ఫలితాలను వెల్లడించారు. పరీక్ష రాసిన వారిలో మొత్తం 15,749 మంది అర్హత సాధించగా, రాష్ట్రవ్యాప్తంగా 70.07 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
విభాగాల వారీగా చూస్తే, పేపర్-1లో 4,942 మంది హాజరుకాగా 3,398 మంది (68.76%) అర్హత సాధించారు. అలాగే పేపర్-2 గణితం, సైన్స్ విభాగంలో 9,131 మంది పరీక్ష రాయగా 6,720 మంది (73.60%) ఉత్తీర్ణులయ్యారు. పేపర్-2 సోషల్ స్టడీస్ విభాగంలో 8,404 మంది హాజరుకాగా 5,631 మంది (67.00%) అర్హత సాధించారు. అభ్యర్థులు తమ ఫలితాలు, మార్కుల వివరాలు మరియు స్కోర్ కార్డును పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ https://schooledu.telangana.gov.in ద్వారా తెలుసుకోవచ్చని, వెబ్‌సైట్‌లోని ఫలితాల లింక్‌పై క్లిక్ చేసి హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. అలాగే సమీపంలోని మీ-సేవ కేంద్రాల నుంచి కూడా మార్కుల వివరాలను పొందవచ్చని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
Also Read
- Dancers Association Dispute: డాన్సర్స్ అసోసియేషన్‌లో విభేదాలు.. అక్టోబర్ 11న ఎన్నికలు
- Nursing Home Seized: వారం రోజుల్లో ఇద్దరు మృతి.. తిరువూరు నర్సింగ్ హోమ్ సీజ్..!
- DGP CV Anand: గణేశ్ నిమజ్జనాల్లో తీవ్ర విషాదాలు.. తెలంగాణలో ఎస్సై సహా 13 మంది మృతి..
- Nani The Paradise Box Office: ‘ది ప్యారడైజ్’ రికార్డు.. నాని కెరీర్లో ఫాస్టెస్ట్ రూ.100 కోట్ల సినిమా..!
తాజావార్తలు
-
TGTET Results 2026: తెలంగాణ ఇన్-సర్వీస్ ఫలితాలు విడుదల.. 70 శాతం దాటిన ఉత్తీర్ణత..!
-
Dancers Association Dispute: డాన్సర్స్ అసోసియేషన్‌లో విభేదాలు.. అక్టోబర్ 11న ఎన్నికలు
-
TRAI Internet TV Rules: TRAI కొత్త రూల్స్.. ఇంటర్నెట్లో ఫ్రీగా టీవీ ఛానెళ్లను చూడటం ఇక కష్టమేనా?
-
Nursing Home Seized: వారం రోజుల్లో ఇద్దరు మృతి.. తిరువూరు నర్సింగ్ హోమ్ సీజ్..!
-
DGP CV Anand: గణేశ్ నిమజ్జనాల్లో తీవ్ర విషాదాలు.. తెలంగాణలో ఎస్సై సహా 13 మంది మృతి..
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?