AFSPA Extension: మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్‌లో.. AFSPA మరో ఆరు నెలలు పొడిగింపు
- AFSPAపై కేంద్రం నిర్ణయం
- మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్‌లో మరో 6 నెలలు అమలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AFSPA Extended Amid Violence in Manipur; కేంద్ర ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల్లో అమలవుతున్న సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం ( Armed Forces Special Powers Act. AFSPA)ను మరో ఆరు నెలల పాటు పొడిగించింది. మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో అక్టోబర్ 1 నుంచి మరో ఆరు నెలల పాటు AFSPA అమల్లో ఉంటుందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) గెజిట్ నోటిఫికేషన్ వెల్లడించింది. అయితే పరిస్థితులు మెరుగుపడితే గడువు ముగియకముందే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది.
మణిపూర్‌లో కొన్ని ప్రాంతాలకు మినహాయింపు
మణిపూర్ రాష్ట్రం మొత్తం ప్రాంతాన్ని AFSPA పరిధిలోకి తీసుకొచ్చినప్పటికీ, ఐదు జిల్లాల్లోని 13 పోలీస్ స్టేషన్ల పరిధికి మినహాయింపు ఇచ్చారు. ఇంఫాల్ వెస్ట్ జిల్లాలో ఇంఫాల్, లాంఫెల్, సిటీ, సింగ్జమై, పాట్సోయి, వాంగోయి పోలీస్ స్టేషన్ల పరిధులు; ఇంఫాల్ ఈస్ట్‌లో పోరోంపట్, హేయింగాంగ్, ఇరిల్బంగ్; థౌబల్ జిల్లాలో థౌబల్; బిష్ణుపూర్ జిల్లాలో బిష్ణుపూర్, నంబోల్; కక్చింగ్ జిల్లాలో కక్చింగ్ పోలీస్ స్టేషన్ పరిధులకు AFSPA నుంచి మినహాయింపు కొనసాగుతుంది.
Also Read
నాగాలాండ్‌లో తొమ్మిది జిల్లాలకు AFSPA
నాగాలాండ్‌లో దిమాపూర్, న్యూలాండ్, చుమౌకెడిమా, మోన్, కిఫైర్, నోక్లాక్, ఫెక్, పెరెన్, మెలురి జిల్లాలను AFSPA కింద ‘అశాంత ప్రాంతాలు’గా ప్రకటించారు. అదనంగా కోహిమా, మోకోక్చుంగ్, లాంగ్లెంగ్, వోఖా, జునెబోటో జిల్లాల్లోని 21 పోలీస్ స్టేషన్ల పరిధులు కూడా నోటిఫికేషన్ పరిధిలో ఉన్నాయి.
అరుణాచల్‌ప్రదేశ్‌లో మూడు జిల్లాల్లో కొనసాగింపు
అరుణాచల్‌ప్రదేశ్‌లో తిరప్, చాంగ్లాంగ్, లాంగ్డింగ్ జిల్లాల్లో AFSPAను మరో ఆరు నెలల పాటు పొడిగించారు.
వచ్చే ఏడాది ఈశాన్యం నుంచి AFSPA తొలగిస్తామని అమిత్ షా ప్రకటన
ఇదిలా ఉండగా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా గతంలో ఈశాన్య ప్రాంతం నుంచి వచ్చే ఏడాది AFSPAను పూర్తిగా తొలగించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఒకటి లేదా రెండు రాష్ట్రాలను మినహాయించి, ఈశాన్య ప్రాంతం మొత్తం నుంచి AFSPAను తొలగించగలమనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈశాన్య ప్రాంతంలో 80 శాతానికి పైగా ప్రాంతం ఇప్పటికే AFSPA నుంచి విముక్తి పొందిందని అమిత్ షా పేర్కొన్నారు. అసోం-నాగాలాండ్ సరిహద్దులోని వివాదాస్పద ప్రాంతంలో చమురు, ఖనిజ అన్వేషణకు సంబంధించిన అవగాహన ఒప్పందం (MoU)పై కూడా ఆయన మాట్లాడారు.
మణిపూర్‌లో నలుగురి మృతదేహాలు వెలికితీత
మరోవైపు మణిపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. కామ్జోంగ్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున నలుగురు వ్యక్తుల బుల్లెట్ గాయాలతో ఉన్న మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. మృతులను వరైషిమ్ జాజో, ఫామి జాజో, బెటర్సన్ జాజో, నింగ్థెమ్ కషక్గా గుర్తించారు. వీరు టాంగ్ఖుల్ నాగ తెగకు చెందినవారిగా అధికారులు తెలిపారు. ఈ హత్యలను మణిపూర్ ముఖ్యమంత్రి వై. ఖేమ్‌చంద్ సింగ్ ఖండిస్తూ, సమాజంలో ఇలాంటి హింసకు చోటు లేదని, ఇటువంటి ఘటనలను సహించబోమని పేర్కొన్నారు. AFSPA పొడిగింపు, మరోవైపు హింసాత్మక ఘటనలు కొనసాగుతుండటంతో మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్‌లో భద్రతా పరిస్థితులు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Amla Side Effects: ఉసిరికాయ ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ సమస్యలుంటే జాగ్రత్త.!
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Pawan Kalyan: ఎన్నికల పద్ధతి ఏదైనా.. ప్రజల మద్దతు కూటమికే.. పవన్ కీలక వ్యాఖ్యలు
-
Nara Lokesh: మున్సిపల్ ఎన్నికల విజయం మరింత పెద్ద బాధ్యత.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
October Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్‌పై డబ్బింగ్ మూవీ దండయాత్ర!
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!