DU Student Harassment: ‘అర్బన్ మైండ్‌సెట్’ టీ-షర్ట్‌పై కామెంట్స్. DU విద్యార్థినిని SUVతో వెంబడించిన యువకులు
- ముఖర్జీ నగర్లో DU విద్యార్థినిపై వేధింపుల ఆరోపణలు
- వీడియో తీయగానే పరారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DU Student Harassment: ఢిల్లీలోని ముఖర్జీ నగర్లో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థినిని కొందరు యువకులు వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. తన టీ-షర్ట్‌పై వ్యాఖ్యలు చేయడాన్ని ప్రశ్నించడంతో కారులో ఉన్న యువకులు అసభ్యంగా మాట్లాడారని, అనంతరం తనను, తన స్నేహితురాలిని కారుతో వెంబడించారని విద్యార్థిని తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. బాధితురాలి వివరాల ప్రకారం.. రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో ఆమె తన స్నేహితురాలితో కలిసి హకీకత్ పార్క్ మోడ్ నుంచి ఓల్డ్ గుప్తా చౌక్ వైపు నడుచుకుంటూ వెళ్తోంది. అదే సమయంలో ఓ SUVలో వచ్చిన కొందరు యువకులు కారు అద్దం దించి ఆమెను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారని ఆమె ఆరోపించింది. ఆ సమయంలో ఆమె ఎరుపు రంగు టీ-షర్ట్ ధరించగా, దానిపై ‘Urban Mindset’ అని రాసి ఉంది. ఆ టీ-షర్ట్‌ను ఉద్దేశించి ఓ యువకుడు వ్యాఖ్యానించాడని విద్యార్థిని తెలిపింది.
అభ్యంతరం చెప్పడంతో అసభ్య పదజాలం
తమపై వ్యాఖ్యలు చేయడాన్ని ఇద్దరు యువతులు వ్యతిరేకించి, మర్యాదగా ఉండాలని సూచించినట్లు బాధితురాలు తెలిపింది. దీంతో కారులో ఉన్న యువకులు మరింత దూకుడుగా వ్యవహరించి అసభ్య పదజాలంతో మాట్లాడారని ఆమె ఆరోపించింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పడంతో యువకులు బెదిరింపులకు పాల్పడ్డారని కూడా ఆమె పేర్కొంది. అనంతరం అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించగా, SUVలో ఉన్న యువకులు తమను వెంబడించడం ప్రారంభించారని తెలిపింది.
Also Read
- Tamil Nadu: బంగారం, డబ్బులు ఎక్స్పోజ్ చేస్తూ రీల్స్.. వీడియోలు చూసి కేజీ గోల్డ్, భారీగా డబ్బు కొట్టేసిన దొంగలు..
- CBSE Gets New Chairman: CBSEకి కొత్త ఛైర్మన్.. ఎవరీ మందీప్ భండారీ?.. పూర్తి వివరాలు ఇవే
- AFSPA Extension: మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్‌లో.. AFSPA మరో ఆరు నెలలు పొడిగింపు
- ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
చౌరస్తాలో కారు అడ్డంగా పెట్టారని ఆరోపణ
కొంతదూరం వెళ్లిన తర్వాత ఓ చౌరస్తా వద్ద యువకులు తమ కారును ఇద్దరు యువతుల ముందు ఆపారని బాధితురాలు తన వాంగ్మూలంలో పేర్కొంది. కారులో ఉన్నవారు అద్దాలు దించి మరోసారి దుర్భాషలాడారని ఆమె ఆరోపించింది. ఈ పరిణామంతో భయపడిన ఆమె తన మొబైల్‌ను బయటకు తీసి ఘటనను వీడియో రికార్డ్ చేసేందుకు ప్రయత్నించినట్లు తెలిపింది.
మొబైల్ కెమెరాను బయటకు తీసిన వెంటనే యువకులు కారును వేగంగా అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారని విద్యార్థిని తెలిపింది. అనంతరం ఆమె పోలీసులను ఆశ్రయించి ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం.
తాజావార్తలు
-
DU Student Harassment: ‘అర్బన్ మైండ్‌సెట్’ టీ-షర్ట్‌పై కామెంట్స్. DU విద్యార్థినిని SUVతో వెంబడించిన యువకులు
-
Avengers Endgame Encore: బాహుబలి రికార్డు బద్దలు.. ఇండియాలో సరికొత్త చరిత్ర సృష్టించిన హాలీవుడ్ మూవీ..!
-
Tamil Nadu: బంగారం, డబ్బులు ఎక్స్పోజ్ చేస్తూ రీల్స్.. వీడియోలు చూసి కేజీ గోల్డ్, భారీగా డబ్బు కొట్టేసిన దొంగలు..
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రెడీ.. తీర్పు కోసం ఎదురుచూపులు.!
-
Asian Games 2026: మహిళల కబడ్డీలో భారత్ జయభేరి.. ఇరాన్‌పై ఉత్కంఠ విజయం.. గోల్డ్ మెడల్ కైవసం
ట్రెండింగ్
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!