Tamil Nadu: బంగారం, డబ్బులు ఎక్స్పోజ్ చేస్తూ రీల్స్.. వీడియోలు చూసి కేజీ గోల్డ్, భారీగా డబ్బు కొట్టేసిన దొంగలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kanyakumari YouTuber House Robbery: తమిళనాడులోని కన్యాకుమారిలో ఓ యూట్యూబర్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఏకంగా 118 సవర్ల బంగారం, దానికి తోడు పెద్ద మొత్తంలో నగదు మాయమైపోయింది. దక్షిణ భారతదేశంలో బంగారం బరువును చెప్పడానికి ‘సవర్’ అనే పదాన్ని వాడతారన్న విషయం తెలిసిందే. ఒక సవర్ అంటే దాదాపు 8 గ్రాములతో సమానం. అంటే ఆ ఇంట్లో చోరీకి గురైన బంగారం ఏకంగా 944 గ్రాములు, అటూ ఇటూగా కేజీకి దగ్గరగా ఉందన్నమాట! వీటితో పాటు ఇంట్లోని క్యాష్‌ను కూడా దొంగలు పట్టుకుపోయారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే.. సోషల్ మీడియాలో సదరు యూట్యూబర్ చూపించిన హడావుడి, ప్రదర్శించిన సంపదే దొంగలకు దారి చూపిందా అనే కోణంలో ఇప్పుడు పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఈ ఘోరం కన్యాకుమారి జిల్లాలోని తమ్మాత్తుకోణం ప్రాంతంలో ఉన్న వీఐపీ గార్డెన్లో జరిగింది. అక్కడ వినోద్ కుమార్ అనే యూట్యూబర్ తన భార్య మధుమితతో కలిసి నివాసముంటున్నాడు. రాత్రి వేళ ఎవరూ లేని సమయం చూసి, గుర్తుతెలియని దుండగులు ఇంటి వెనుక తలుపులు బద్దలుగొట్టి లోపలికి చొరబడ్డారు. ఇంట్లో దాచి ఉంచిన బంగారు నగలు, నగదును సర్దేసి అక్కడి నుంచి జారుకున్నారు. ఈ చోరీ అసలు ఏ టైమ్‌లో జరిగింది? ఎంతమంది దొంగలు వచ్చారు? వారు ఏ దారిలో వచ్చి ఎలా పరారయ్యారనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఘటనపై సమాచారం అందగానే రాజాక్కమంగళం పోలీసులు వెంటనే రంగాంలోకి దిగారు. బాధితుడి ఇంటిని పరిశీలించి, చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజీలను జల్లెడ పడుతున్నారు. దొంగలు ఎక్కడైనా కెమెరాలకు చిక్కారా? అని ఆరా తీస్తున్నారు.
Also Read
- India First Bullet Train: గంటకు 280 కి.మీ వేగం.. వై-ఫై నుంచి లగ్జరీ సీట్ల వరకు.. భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ విశేషాలు
- జైపూర్, జోధ్‌పూర్, జైసల్మేర్ పేర్లతో Range Rover SV Sawai Collection లాంచ్..!
- Hyderabad: పాతబస్తీలో దారుణ హత్య.. యువకుడిని కత్తులతో దాడి చేసి చంపిన దుండగులు
- YS Jagan: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై కేసు నమోదు..
ఇక ఈ కేసుకు సంబంధించి బయటపడిన సోషల్ మీడియా యాంగిల్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ యూట్యూబర్ దంపతులు తమ సోషల్ మీడియా వీడియోల్లో తరచుగా భారీగా బంగారు నగలు, కట్టల కొద్దీ నగదును ప్రదర్శిస్తూ ఉండే వారని రిపోర్టులు చెప్తున్నాయి. దీంతో సోషల్ మీడియా వీడియోలను చూసే దొంగలు స్కెచ్ వేశారా? లేదా ఆ ఇంట్లో ఇంత పెద్ద మొత్తంలో విలువైన వస్తువులు ఉన్నాయని వారికి ముందే సమాచారం ఉందా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. దొంగలు రాకముందే ఇల్లు, పరిసర ప్రాంతాలపై రేకీ నిర్వహించారా? లేక ఉన్నట్టుండి వచ్చి పడ్డారా అనే దిశగానూ దర్యాప్తు సాగుతోంది. వెనుక తలుపునే ఎందుకు ఎంచుకున్నారు, దొంగతనానికి ఏమైనా వాహనం వాడారా, చోరీ తర్వాత ఏ దిశగా పరారయ్యారనే అంశాలను సేకరిస్తున్నారు. సీసీటీవీ ఆధారాలు, ఘటనా స్థలంలో దొరికిన క్లూస్‌తో దొంగల మూలాలు లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ కేసులో ఎవరినీ గుర్తించలేదు, అరెస్టులు కూడా జరగలేదు, విచారణ వేగవంతంగా సాగుతోంది. ఇక్కడ విషయం కేవలం ఓ యూట్యూబర్ ఇంట్లో కేజీ బంగారం దొంగతనం జరిగిందనేది మాత్రమే కాదు! దొంగలకు ఇంట్లోని ఈ భారీ నిధి గురించి సమాచారం ఎలా తెలిసింది? వారు పక్కా ప్లాన్‌తో రేకీ చేసి వచ్చారా లేక సోషల్ మీడియాలో చూపించిన హంగామానే దొంగలను ఆకర్షించిందా? అనేవే అసలు ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నింటికీ పోలీసుల విచారణ పూర్తి అయి, సీసీటీవీ ఫుటేజీలు క్లియర్‌గా తేలితే గానీ సరైన సమాధానం దొరకదు.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పోస్టల్ బ్యాలెట్లో టీడీపీ లీడ్!
-
India First Bullet Train: గంటకు 280 కి.మీ వేగం.. వై-ఫై నుంచి లగ్జరీ సీట్ల వరకు.. భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ విశేషాలు
-
జైపూర్, జోధ్‌పూర్, జైసల్మేర్ పేర్లతో Range Rover SV Sawai Collection లాంచ్..!
-
Hyderabad: పాతబస్తీలో దారుణ హత్య.. యువకుడిని కత్తులతో దాడి చేసి చంపిన దుండగులు
-
YS Jagan: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై కేసు నమోదు..
-
Glenn Maxwell Retirement: కాలికి గాయమైనా వీరోచిత పోరాటం.. వరల్డ్ కప్‌లో మాక్స్వెల్ 201 పరుగుల ఇన్నింగ్స్..
ట్రెండింగ్
-
ఐఫోన్, శాంసంగ్‌కు పోటీగా Xiaomi 18 Pro సిరీస్.. గ్లోబల్ మార్కెట్లోకి Xiaomi 18 Pro, 18 Pro Max.. 200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్..!
-
WhatsApp New Features: వాట్సాప్‌లో కీలక మార్పులు.. గ్రూప్ చాట్స్ కోసం సరికొత్త ఫీచర్స్ అప్డేట్స్..!
-
Rohit Sharma Records: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. హిట్ మ్యాన్ ఖాతాలో చేరనున్న అరుదైన రికార్డులు లిస్ట్ ఇదిగో..!
-
International Day for Biosphere Reserves : ప్రకృతికి, మనుషులకు వారధి.. బయోస్ఫియర్ రిజర్వ్‌ల ప్రత్యేకత ఏంటో తెలుసా?
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి