Dancers Association Dispute: డాన్సర్స్ అసోసియేషన్‌లో విభేదాలు.. అక్టోబర్ 11న ఎన్నికలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dancers Association Dispute: డాన్సర్స్ అసోసియేషన్‌లో నెలకొన్న వివాదాలపై డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రఘు మాస్టర్ ఆధ్వర్యంలో ఫిల్మ్ ఛాంబర్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్య మాస్టర్, రాజన్న మాస్టర్ తదితరులు అసోసియేషన్‌లోని సమస్యలపై మాట్లాడారు.
ఒక యూనియన్‌కు సంబంధించిన అంతర్గత సమస్యలు బహిరంగంగా చర్చకు రావడం బాధాకరమని సత్య మాస్టర్ అన్నారు. అసోసియేషన్‌లో సుమారు 600 మంది డాన్సర్లు ఉన్నారని, అయితే కొంతమంది కారణంగా మొత్తం అసోసియేషన్‌కు ఇబ్బందులు వస్తున్నాయని ఆరోపించారు. డాన్సర్స్ అసోసియేషన్‌లో అనేక సమస్యలు ఉన్నాయని, అసోసియేషన్‌ను బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నందుకే తాము మీడియా ముందుకు వచ్చామని అన్నారు.
Also Read
- JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
- Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
- Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
- Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత సరైన నిర్ణయాలు తీసుకోవాలని సత్య మాస్టర్ కోరారు. ఆమె ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నారు. అసోసియేషన్‌లో కొంతమంది సభ్యులు మాట్లాడేందుకు భయపడుతున్నారని, అందుకే సీనియర్లుగా తాము వారి తరఫున మాట్లాడుతున్నామని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడుతున్న సభ్యుల నుంచి మైక్ తీసుకునే పరిస్థితి ఏర్పడిందని సత్య మాస్టర్ ఆరోపించారు. అధ్యక్షురాలి హోదాలో పరిస్థితిని నియంత్రించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, అందుకు బదులుగా కొందరిని సమర్థించడం సరికాదన్నారు. సమావేశంలో మినిట్స్ బుక్ తీసుకునే ప్రయత్నం కూడా జరిగిందని పేర్కొన్నారు.
ఫెడరేషన్ తమకు తల్లిలాంటిదని సత్య మాస్టర్ అన్నారు. ఫెడరేషన్ విషయంలో పరిస్థితిని బట్టి భిన్నంగా వ్యవహరించడం వల్లే సమస్యలు వస్తున్నాయని ఆరోపించారు. యూనియన్‌కు సమస్య వచ్చినప్పుడు సీనియర్లుగా తాము తప్పకుండా స్పందిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు అక్టోబర్ 11న ఎన్నికలు నిర్వహించేందుకు సభ్యుల నిర్ణయం మేరకు ముందుకు వెళ్తున్నామని సత్య మాస్టర్ తెలిపారు. డాన్సర్లకు న్యాయం జరగాలంటే ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.
సుమలత తమపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని రాజన్న మాస్టర్ అన్నారు. ఇటీవల జరిగిన జనరల్ బాడీ సమావేశంలో మెజారిటీ డాన్సర్లు అక్టోబర్ 11న ఎన్నికలు నిర్వహించేందుకు మద్దతు తెలిపారని పేర్కొన్నారు. ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్‌పై సుమలత చేసిన ఆరోపణలను కూడా రాజన్న మాస్టర్ ఖండించారు. తమపై, ఫెడరేషన్ అధ్యక్షుడిపై చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపారు. అసోసియేషన్‌లో నెలకొన్న సమస్యలకు పరిష్కారం కోసం ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
-
JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
-
Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
ట్రెండింగ్
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!