సార్వత్రిక ఎన్నికల వేల బీజేపీ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే 400 సీట్లు లక్ష్యంగా ప్రచారంలో కమలం పార్టీ దూసుకెళ్లోంది. ఇలాంటి తరుణంలో హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వివాదాస్పద నేత, ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు బీజేపీ అధిష్టానం షాకిచ్చినట్లు తెలుస్తోంది. ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ టికెట్ కట్ చేసినట్లు సమాచారం. కైసర్‌గంజ్ నుంచి ప్రస్తుతం ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా గత కొంతకాలంగా జాతీయ స్థాయి రెజ్లర్ల ఆందోళన చేపట్టారు. దీని ఫలితంగానే కాషాయ పార్టీ ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ పార్టీ వర్గాలే ఓ జాతీయ మీడియాకు వెల్లడించాయి. అతని స్థానంలో కుమారుడు కరణ్ భూషణ్ సింగ్‌కు టికెట్ ఇచ్చే అవకాశాలున్నట్లు సమాచారం. మరోవైపు బ్రిజ్ భూషణ్ కూడా తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మరోసారి టికెట్ సంపాదించేందుకు తీవ్రంగా యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఐదో విడతలో భాగంగా మే20వ తేదీన కైసర్‌గంజ్‌లో పోలింగ్ జరగనుంది. ఇక్కడ నామినేషన్ దాఖలు చేయడానికి తుది గడువు శుక్రవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో గురువారం అభ్యర్థని ప్రకటించే అవకాశాలున్నాయి.
ఇది కూడా చదవండి: Rahul Gandhi : చివరి క్షణంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం.. అమేథి కాకుండా రాహుల్ పోటీ ఇక్కడినుంచే
జాతీయ రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణ విషయంలో బ్రిజ్‌భూషణ్ వార్తల్లో నిలిచారు. గతేడాది ఆయన రెజ్లింగ్ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా క్రీడా రాజకీయాలకు స్వస్తి చెప్పినట్లు ప్రకటించారు. తన స్థానంలో సన్నిహితుడైన సంజయ్‌సింగ్‌ను ఎంపికయ్యేందుకు కృషి చేశాడు. బ్రిజ్‌భూషణ్ ఉత్తరప్రదేశ్‌లో అతిపెద్ద బాహుబలి నేతల్లో ఒకరిగా పేరున్న వ్యక్తి. ఎంపీగా ఏకంగా ఆరుసార్లు పార్లమెంట్‌లో అడుగుపెట్టిన నాయకుడు. భారీ సంఖ్యలో కేసులు ఉన్నా రకరకాల రాజ్యాంగ పదవులను అనుభవిస్తున్నాడు. భారీ ఎత్తున విద్యాసంస్థలు, అఖాడాలు నిర్వహిస్తూ యువతలో పాపులారిటీ సంపాదించాడు. యూపీలోని గోండా చుట్టుపక్కల అరడజను జిల్లాలో బ్రిజ్‌భూషణ్ హవా నడుస్తుంది. ఇక బ్రిజ్‌భూషణ్‌పై ఆరోపణలను బీజేపీ అధిష్టానం ఖండించింది. అతనిపై ఢిల్లీ కోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది.
ఇది కూడా చదవండి: Vaishnav Tej :మొన్న వరుణ్ తేజ్.. నిన్న వైష్ణవ్ తేజ్.. పవన్ కోసం కదిలొస్తున్న మెగా ఫ్యామిలీ..
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే రెండు విడతల్లో పోలింగ్ ముగిసింది. ఇక మూడో విడత పోలింగ్ మే 7న జరగనుంది. అనంతరం మే 13, 20, 25, జూన్ 1న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదలకానున్నాయి.