ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది .మరో 10 రోజులలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్నాయి.తాజా ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే ఈ సారి ఎన్నికలలో పవన్ గెలుపు కోసం టాలీవుడ్ నుంచి చాలామంది నటీనటులు పిఠాపురంలో భారీగా ప్రచారం చేస్తున్నారు.రీసెంట్ గా జబర్దస్త్ టీం రాంప్రసాద్, హైపర్ ఆది మరియు గెటప్ శీను ప్రచారం చేయడం జరిగింది. ఆ తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ కూడా బాబాయ్ పవన్ కల్యాణ్ గెలవాలని ప్రచారం నిర్వహించారు. ఇదిలా ఉంటే బుధవారం మరో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కూడా మావయ్య పవన్ కల్యాణ్ కోసం పిఠాపురంలో జనసేన పార్టీ తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
వచ్చే ఎన్నికలలో తన మామ పవన్ కల్యాణ్ కి ఓటేసి గెలిపించాలని వైష్ణవ్ తేజ్ ప్రజలను కోరారు. పిఠాపురం పాదగయ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రోడ్ షో లో పాల్గొన్నారు.ఈ రోడ్ షో లో వైష్ణవ్ తేజ్ తో పాటు గెటప్ శీను మరియు సుడిగాలి సుదీర్ పాల్గొనడం జరిగింది. అలాగే నాగబాబు సతీమణి కొణిదల పద్మ కూడా పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు.దీనితో ఈసారి పవన్ కల్యాణ్ ను గెలిపించుకోవాలని మెగా ఫ్యామిలీ పిఠాపురంకు కదిలి వస్తుంది. అయితే గత ఎన్నికలలో పవన్ కల్యాణ్ భీమవరం మరియు గాజువాక నుండి పోటీ చేసి ఓడిపోయారు.దీనితో ఈసారి పవన్ పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో గెలవాలని చూస్తున్నారు .