దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. 27 ఏళ్ల తర్వాత కాషాయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. అయితే ఇంకా ముఖ్యమంత్రి ఎవరనేది ఇంకా తేలలేదు గానీ.. ప్రమాణస్వీకారం ఏర్పాట్లు మాత్రం గ్రాండ్‌గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. దేశ రాజధాని కాబట్టి… అందరి కళ్లు ఢిల్లీపై ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని అతిరథ మహరథులందరినీ ఈ కార్యక్రమానికి పిలవాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది.
ఇది కూడా చదవండి: Hyderabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో తప్పిన భారీ ప్రమాదం.. అత్యవసరంగా కార్గో విమానం ల్యాండింగ్
ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారానికి 50 మంది సినీ తారలను, పారిశ్రామిక వేత్తలను, దౌత్యవేత్తలకు ఆహ్వానాలు పంపాలని భావిస్తోంది. ఇక ప్రమాణస్వీకార కార్యక్రమం రాంలీలా మైదానంలో నిర్వహించనున్నారు. బీజేపీ అగ్ర నేతలతో పాటు కేంద్రమంత్రులు, మిత్రపక్షాలు హాజరుకానున్నారు. 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ ప్రోగ్రామ్‌కి హాజరుకానున్నారు. మరిచిపోలేని విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక దేశంలోని ఆధ్యాత్మిక వేత్తలు బాబా రామ్‌దేవ్, స్వామి చిదానంద, బాబా బాగేశ్వర్ ధీరేంద్ర శాస్త్రి, ఇతర మత ప్రముఖులను కూడా ఈ కార్యక్రమానికి పిలవనున్నారు. ఈ వేడుక సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ వేదికపై సంగీత కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. కైలాష్ ఖేర్ ఆధ్వర్యంలో సంగీత ప్రదర్శన జరగనుంది.
ఇది కూడా చదవండి: UP: వివాహిత అనుమానాస్పద మృతి..! మిస్టరీగా 4 ఏళ్ల చిన్నారి డ్రాయింగ్!
ఇదిలా ఉంటే ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఫిబ్రవరి 8న ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు వచ్చాయి. ఆ మరుసటి రోజే ప్రధాని మోడీ ఫ్రాన్స్, అమెరికా పర్యటనకు వెళ్లారు. దీంతో సీఎం ఎంపిక వాయిదా పడింది. తీరా.. మోడీ వచ్చాక కూడా ముఖ్యమంత్రి ఎంపిక జరగలేదు. ఢిల్లీ సీఎం పీఠాన్ని అధిరోహించేది ఎవరనేది ఆసక్తిగా మారింది. అయితే ఈసారి మహిళలకు ఇవ్వొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళా ముఖ్యమంత్రులు లేరు. ఈ నేపథ్యంలో మహిళలకు ఎక్కువ ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తు్న్నాయి. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. బీజేపీ 48, ఆప్ 22 స్థానాలు కైవసం చేసుకున్నాయి.
ఇది కూడా చదవండి: Chhaava: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘చావా’..