బాలీవుడ్ లో గత శుక్రవారం విడుదలైన ‘చావా’ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తుంది.విక్కీ కౌశల్, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించాడు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్. ఇక ఈ మూవీ విడుదలైన అన్ని చోట్ల విజయపథాన దూసుకుపోతుంది. ముఖ్యంగా విక్కీ కౌశల్ తో పాటు రష్మిక తమ క్యారెక్టర్స్‌లో జీవించారని, పతాక సన్నివేశాల్లో విక్కీ కౌశల్ నటనకి ప్రతి ఒక ప్రేక్షకుడు జేజేలు పలుకుతున్నారు. అంతే కాదు కొన్ని సీన్స్ చూసి కన్నీరు పెట్టుకున్నారు ప్రేక్షకులు. అయితే తాజాగా వినిపిస్తున్న విషయం ఏంటి అంటే..
Also Read:AlluArjun: అల్లు అర్జున్, అట్లీ మూవీలో హీరోయిన్ ఫిక్స్..?
ఇప్పటికే వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి వీక్ డేస్‌లో కూడా స్ట్రాంగ్‌గా కొనసాగుతున్న ఈ సినిమాను కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ అయింది. అయితే ఈ చిత్రం కోసం ఇతర భాషల వారు కూడా మాట్లాడుకుంటున్నారట. మెయిన్‌గా మన తెలుగు ఆడియెన్స్‌లో చావా ప్రస్తావన సోషల్ మీడియాలో ఎక్కువ వినిపిస్తోంది. బాలీవుడ్ నుంచి ఏవేవో సినిమాలు పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేస్తున్నారు కానీ ఇలాంటి సినిమాలు కదా రిలీజ్ చెయ్యాలి అని వారు భావిస్తున్నారు. ఇండస్ట్రీ ఏదైనా కథ నచ్చితే తెలుగు ఆడియన్స్ కచ్చితంగా ఆ మూవీని సపోర్ట్ చేస్తారు. అలా వచ్చి తెలుగులో హిట్ అయిన చిత్రాలు బోలెడన్ని ఉన్నాయి. ప్రజంట్ టాలీవుడ్ రేంజ్ కూడా అని ఇండస్ర్టీ తో పోలిస్తే ముందజలో ఉంది. ఇక ఇవన్నీ తెలిసి కూడా చావా మేకర్స్ ఇంత మంచి అవకాశాన్ని మిస్ చేసుకుంటున్నారనే చెప్పాలి.