ఢిల్లీలో జరిగిన ఓ వివాహ వేడుకలో బాలీవుడ్ స్టార్ హీరోలు షారూఖ్‌ఖాన్-సల్మాన్ ఖాన్ డ్యాన్స్‌తో ఇరగదీశారు. స్టేజ్‌పై డ్యాన్స్ చేస్తూ అతిథులను ఉత్సాహ పరిచారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Al-Falah University: ఈడీ దాడుల ఎఫెక్ట్.. పలువురు ప్రొఫెసర్లు.. స్థానికులు అదృశ్యం.. రంగంలోకి హర్యానా డీజీపీ
దేశ రాజధాని ఢిల్లీలో ఒక వివాహ కార్యక్రమం జరిగింది. ఈ పెళ్లికి షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ హాజరయ్యారు. అనంతరం స్టేజ్‌పైకి ఎక్కి మైక్ అందుకున్నారు. ఐకానిక్ పాట ‘‘ఓ ఓహ్ జానే జానా’’ పాటను పాడారు. అందుకు తగ్గట్టుగా ఇద్దరూ కూడా స్టెప్‌లు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే ఈ పెళ్లి ఎప్పుడో జరిగితే.. తాజాగా అందుకు సంబంధించిన క్లిప్ ఇప్పుడూ వైరల్ అవుతోంది. ఇక అభిమానులు అయితే ఆనందోత్సహాల్లో మునిగిపోయారు. తమ అభిమాన హీరోలు ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేయడం అద్భుతంగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.