వామ్మో.. అల్-ఫలాహ్ యూనివర్సిటీ కేంద్రంగా చాలా పెద్ద కుట్ర జరిగినట్లుగా తాజా పరిణామాలను బట్టి అర్థమవుతోంది. ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత దర్యాప్తు సంస్థలు చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉగ్ర మూలాలు అల్-ఫలాహ్ యూనివర్సిటీలో బయటపడ్డాయి. కీలక ఉగ్రవాదులు ఉమర్, షాహీన్, ముజమ్మిల్ ముగ్గురు కూడా విశ్వవిద్యాలయం కేంద్రంగానే దేశ వ్యాప్త దాడులకు ప్రణాళికలు రచించారు. ఇంత పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుందంటే.. అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తోంది. ఇప్పుడు అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంటే జరిగిన కుట్రలో అంతర్గతంగా వాళ్లు పాత్ర ఉన్నట్లుగా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Australia: ఆస్ట్రేలియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 నెలల భారతీయ గర్భిణీ మృతి
తాజాగా మంగళవారం ఉదయం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు పెద్ద ఎత్తున క్యాంపస్‌లో దాడులు చేశారు. జామియానగర్‌లో సంస్థ చైర్మన్ ఇంట్లో సహా మొత్తం 25 చోట్ల అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే ఈడీ దాడుల నేపథ్యంలో క్యాంపస్‌లో ఉండాల్సిన చాలా మంది ప్రొఫెసర్లు ఇప్పుడు అదృశ్యమైనట్లుగా అధికారులు గుర్తించారు. అంతమాత్రమే కాకుండా క్యాంపస్‌కు సమీపంలో ఉండే చాలా మంది స్థానికులు కూడా కనిపించకుండా పోయారు. దీంతో అధికారులకు పెద్ద ఎత్తున అనుమానాలు రేకెత్తుతున్నాయి. అంటే క్యాంపస్ వేదికగా చాలా కుట్రలు జరిగినట్లుగా భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Gold Rates: గోల్డ్ లవర్స్‌కు మళ్లీ షాక్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
ప్రస్తుతం హర్యానా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ఓపి సింగ్ రంగంలోకి దిగారు. మంగళవారం క్యాంపస్‌ను సందర్శించారు. దీంతో క్యాంపస్‌లో చాలా దిగ్భ్రాంతికర విషయాలను గుర్తించారు. ఈ నేపథ్యంలో అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంలో భద్రతా లోపాలపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు. క్యాంపస్ నుంచి అదృశ్యమైన ప్రొఫెసర్లు, స్థానికులు ఎవరో గుర్తించాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు.
అంతేకాకుండా యూనివర్సిటీలోనే ఉంటూ ఇంత పెద్ద స్థాయిలో ఉగ్రదాడులకు వైద్యుల బృందం ఎలా ప్లాన్ చేయగలిగిందో ప్రధానంగా దృష్టి పెట్టాలని డీజీపీ ఆదేశించారు. క్యాంపస్ భద్రత, పర్యవేక్షణపై దర్యాప్తు చేయాలని సూచించారు. పైగా పెద్ద సంఖ్యలో అధ్యాపకులు, అలాగే విశ్వవిద్యాలయం చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన చాలా మంది స్థానికుల ఆచూకీ లభించడం లేదు. పైగా ప్రొఫెసర్లు ఎవరు కూడా అడ్మినిస్ట్రేషన్‌కు సమాచారం ఇవ్వకుండానే అదృశ్యమయ్యారు. వాళ్లంతా సమాచారం ఇవ్వకుండానే ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో.. సమీప గ్రామస్తులు కూడా సడన్‌గా ఎందుకు అదృశ్యమయ్యారో ఈ వివరాలన్నీ సేకరించాల్సిదిగా డీజీపీ ఆదేశించారు. ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తుంటే.. ఈ కుట్రలో ఇంకా ప్రొఫెసర్లు, స్థానికుల పాత్ర కూడా ఉన్నట్లుగా దర్యాప్తు బృందాలు భావిస్తున్నాయి. వీళ్ల ఆచూకీ లభిస్తే.. ఢిల్లీ బ్లాస్ట్ వెనుక ఇంకేమీ కుట్ర జరిగిందో బయటపడనుంది.