Congress vs BJP: బీహార్, బీడీలు ‘బీ’తోనే ప్రారంభమవుతాయి.. కాంగ్రెస్ పోస్ట్‌పై తీవ్ర దుమారం
- బీహార్, బీడీలు ‘బీ’తోనే ప్రారంభమవుతాయి
- కాంగ్రెస్ పోస్ట్‌పై తీవ్ర దుమారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల షెడ్యూల్ రాకముందే బీహార్ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. నిన్నామొన్నటిదాకా ఎన్నికల సంఘం లక్ష్యంగా కాంగ్రెస్ తీవ్ర యుద్ధమే చేసింది. అధికార పార్టీతో ఈసీ కుమ్మక్కై ఓట్ల చోరీ చేస్తున్నారంటూ రాహుల్ గాంధీ యాత్ర చేపట్టారు. తాజాగా కాంగ్రెస్ పెట్టిన ఒక పోస్ట్ తీవ్ర దుమారం రేపుతోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో మార్పులు తీసుకొచ్చింది. కొన్నింటినీ తగ్గించింది. లగ్జరీ వాటిపై పెంచింది. తాజాగా ఇదే అంశాన్ని కోడ్ చేస్తూ కేరళ కాంగ్రెస్ ఒక పోస్ట్ పెట్టింది. బీడీ, బీహార్.. రెండు కూడా ‘బీ’తోనే ప్రారంభమవుతాయని.. ఇకపై వాటిని పాపంగా పరిగణించలేమంటూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టింది. సిగరెట్లు, బీడీలు, పొగాకుపై సవరించిన జీఎస్టీ రేట్ల వివరాలను పంచుకుంటూ రాసింది. వెంటనే పోస్ట్‌ను కూడా తొలగించింది. కానీ అంతలోనే జరగాల్సిన రచ్చ అంతా జరిగిపోయింది.
ఇది కూడా చదవండి: Trump: ట్రంప్ విందులో గూగుల్ వ్యవస్థాపకుడు చిలిపి చేష్టలు.. ఏం చేశాడంటే..!
Also Read
- LK Advani Health Update: ఐసీయూలో మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ.. హెల్త్ బులిటిన్ విడుదల..
- Earthquake: పాకిస్థాన్‌లో భారీ భూకంపం.. భారత్‌లోనూ ప్రకంపనలు
- Noida: ప్రాణం తీసిన మ్యాగీ.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
- DDA Karmayogi Awas Yojana: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఫ్లాట్లపై 25 శాతం డిస్కౌంట్.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే..!
కాంగ్రెస్ పోస్ట్‌పై బీజేపీ తీవ్రంగా మండిపడింది. బీజేపీ సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న ప్రధాని మోడీ తల్లిని విమర్శించారని.. ఇప్పుడు ఏకంగా బీహార్ ప్రజలందరినీ అవమానించారని ధ్వజమెత్తారు. ఇక బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనవల్లా మాట్లాడుతూ.. కాంగ్రెస్ హద్దులు దాటిందని వ్యాఖ్యానించారు. తొలగించిన కాంగ్రెస్ పోస్ట్‌ను రీపోస్ట్ చేశారు. మోడీ తల్లిని తిట్టిన తర్వాత.. ఇప్పుడు బీహార్‌ను అవమానించిన కాంగ్రెస్‌ను తేజస్వి యాదవ్ సమర్థిస్తారా? అని అడిగారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దగ్గర నుంచి డీఎంకే వరకు బీహార్‌పై ద్వేషం స్పష్టంగా కనిపిస్తుందన్నారు.
ఇది కూడా చదవండి: Trump: భారత్‌లో పెట్టుబడులు ఆపండి.. వైట్‌హౌస్ విందులో ఆపిల్ సీఈవోకు ట్రంప్ సూచన
ఇక జనతాదళ్ యునైటెడ్ నాయకుడు సంజయ్ కుమార్ ఝా కూడా కాంగ్రెస్‌పై మండిపడ్డారు. మరో సిగ్గుచేటు చర్యగా అభివర్ణించారు. ‘‘B అంటే బీడీ మాత్రమే కాదని, బుద్ధి (తెలివి) అని కూడా నేను మీకు చెప్తాను. అది మీకు లేదు. B అంటే బడ్జెట్ కూడా, బీహార్ ప్రత్యేక సహాయం పొందినప్పుడు ఇది మిమ్మల్ని అసూయపడేలా చేస్తుంది.’’ అని హిందీలో రాశారు. బీహార్‌ను అపహాస్యం చేయడం ద్వారా కాంగ్రెస్ మరోసారి బీహార్ ప్రజలను అవమానించడమే కాకుండా దేశ అద్భుతమైన చరిత్ర, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని ఝా అన్నారు.
సెప్టెంబర్ 3న జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించిన కొత్త రేట్ల ప్రకారం.. బీడీలపై గతంలో విధించిన 28 శాతం పన్నుకు బదులుగా ఇప్పుడు 18 శాతం పన్ను తగ్గించారు.
पहले हमारे माननीय प्रधानमंत्री श्री @narendramodi जी की पूजनीय माता जी का अपमान और अब पूरे बिहार का अपमान — यही है कांग्रेस का असली चरित्र, जो बार-बार देश के सामने उजागर हो रहा है। pic.twitter.com/VvliP16tTJ
— Samrat Choudhary (@samrat4bjp) September 5, 2025
తాజావార్తలు
-
LK Advani Health Update: ఐసీయూలో మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ.. హెల్త్ బులిటిన్ విడుదల..
-
Naga Vamsi : భారీ రేట్లు చూసి భయపడ్డా కానీ దసరాకే లాభాల పంట.. నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Deva : రజనీ బాషా మ్యూజిక్ డైరెక్టర్ మృతి
-
TGSPDCL: తెలంగాణలో రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్.. ఈ సింపుల్ టిప్స్‌తో మీ ఇంట్లో కరెంట్‌ను సేవ్ చేయండి..
-
Katie Zacharia: ట్రంప్‌తో పని చేయడం గౌరవంగా ఉంది.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా తొలగింపుపై జకారియా కీలక పోస్ట్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!