ఎన్నికల షెడ్యూల్ రాకముందే బీహార్ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. నిన్నామొన్నటిదాకా ఎన్నికల సంఘం లక్ష్యంగా కాంగ్రెస్ తీవ్ర యుద్ధమే చేసింది. అధికార పార్టీతో ఈసీ కుమ్మక్కై ఓట్ల చోరీ చేస్తున్నారంటూ రాహుల్ గాంధీ యాత్ర చేపట్టారు.
Congress: ప్రధాని నరేంద్రమోడీని అవమానించే విధంగా కేరళ కాంగ్రెస్ యూనిట్ ‘‘ఒకే దేశం-ఒకే భర్త’’ అనే ట్యాగ్‌లైన్‌తో చేసిన ట్వీట్ రాష్ట్రంలో కొత్త వివాదానికి కారణమైంది. సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేసియబడిన ఈ పోస్ట్, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారింది. కాంగ్రెస్ హిందూ ఆచారాలను టార్గెట్ చేస్తోంది, అగౌరవపరుస్తోందని, బుజ్జగింపు రాజకీయాల్లో పాల్గొంటోందని కేరళ బీజేపీ, కాంగ్రెస్‌ని తీవ్రంగా విమర్శించింది.
Congress: కేరళ చిత్ర పరిశ్రమ ‘‘మాలీవుడ్’’లో హేమా కమిటీ నివేదిక సంచలనాన్ని సృష్టించింది. ఇండస్ట్రీలో మహిళలపై లైంగిక వేధింపులను వెలుగులోకి తెచ్చింది. ఈ రిపోర్టు సంచలనంగా మారిన తరుణంలోనే కేరళ కాంగ్రెస్‌లో కూడా ఫిలిం ఇండస్ట్రీ తరహాలోనే ‘‘కాస్టింగ్ కౌచ్’’ ఉందని ఆ పార్టీకి చెందిన మహిళా నేత రోజ్‌బెన్ జాన్ ఆరోపించడం సంచలనంగా మారింది. ఆమె ఆరోపణలు చేసిన కొన్ని గంటల్లోనే పార్టీ ఆమెను తొలగించింది.
కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ తీసుకురానున్న యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ)పై కేరళ ప్రతిపక్షం ఆందోళనలకు సిద్ధపడింది. కేరళలో సీపీఐఎం అధికారంలో ఉన్న నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ ప్రతిపక్షంలో కొనసాగుతోంది.
కేరళకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత జానీ నెల్లూరు బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. నెల్లూరు యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్) కార్యదర్శి పదవికి కూడా రాజీనామా చేశారు. కేరళ కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన తర్వాత, జానీ నెల్లూరు జాతీయ సెక్యులర్ పార్టీని ఏర్పాటు చేస్తానని, అది భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌లో చేరుతుందని చెప్పారు.