జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదానికి గల కారణాలను రెండు దర్యాప్తు సంస్థలు అన్వేషిస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 279 మంది చనిపోయారు. ఇక ప్రమాదం జరిగిన 28 గంటల తర్వాత ప్రమాద స్థలి నుంచి బ్లాక్ బాక్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.