నేరాలను అరికట్టాల్సిన ఖాకీనే కిలాడీగా మారింది. చేసేది పవర్‌ఫుల్ ఉద్యోగం.. బుద్ధేమో కంత్రీ బుద్ధి. స్నేహితురాలి ఇంటికొచ్చి ఆమె ఇంటికే కన్నం వేసింది. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు చూసి అంతా షాక్ అయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Bengaluru: అమానుషం.. రోడ్డుపై చిన్న ప్రమాదానికే యువకుడి ప్రాణం తీసిన దంపతులు
కల్పనా రఘువంశీ.. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ పోలీస్ శాఖలో సీనియర్ మహిళా అధికారిణి. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హోదాలో బాధ్యతలు నిర్వర్తిస్తోంది. జహంగీరాబాద్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఉన్న స్నేహితురాలి ఇంటికి కల్పనా రఘువంశీ వచ్చింది. ఆ సమయంలో స్నేహితురాలు ఫోన్ ఛార్జింగ్ పెట్టి బాత్రూమ్‌లోకి స్నానం చేసేందుకు వెళ్లింది. తిరిగి వచ్చేటప్పటికీ బ్యాగ్‌లో ఉన్న రూ.2 లక్షల నగదు, రెండు సెల్‌ఫోన్లు మాయం అయ్యాయి. దీంతో ఒక్కసారిగా కంగారు పడింది. వెంటనే సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా కల్పనా రఘువంశీ ఇంట్లోకి వచ్చి.. వెంటనే నగదు తీసుకుని వెళ్లిపోతున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురైంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది.
ఇది కూడా చదవండి: Trump-Jinping: 6 ఏళ్ల తర్వాత ట్రంప్-జిన్‌పింగ్ తొలిసారి భేటీ
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు చూసి అవాక్కయ్యారు. ప్రస్తుతం నిందితురాలైన డీఎస్పీ కల్పనా రఘువంశీ పరారీలో ఉంది. ఆమె కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. అదనపు పోలీసు సూపరింటెండెంట్ బిట్టు శర్మ మాట్లాడుతూ.. పోలీసు ప్రధాన కార్యాలయం నిందితురాలైన అధికారికి శాఖాపరమైన నోటీసు జారీ చేసినట్లు తెలిపారు. క్రమశిక్షణా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
ఇదిలా ఉంటే చోరీకి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. చట్టాన్ని కాపాడాల్సిన వాళ్లే.. నేరాలకు పాల్పడుతున్నారంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో అధికారిని రక్షించొద్దని కోరారు.
#भोपाल में पुलिस विभाग को शर्मसार करने वाली घटना आई सामने.. यहां महिला #DSP पर अपनी ही सहेली के घर चोरी का आरोप लगा है…DSP की पोल घर पर लगे सीसीटीवी कैमरे ने खोल दी…#Bhopal #KalpanaRaghuvanshi pic.twitter.com/efTWJACWkh
— News Art (न्यूज़ आर्ट) (@tyagivinit7) October 29, 2025