Atishi: ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషికి అరుదైన ప్రశంసలు దక్కాయి. అరవింద్ కేజ్రీవాల్ కంటే అతిషీ వెయ్యి రెట్లు నయమని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రశంసించారు. శుక్రవారం ఇందిరాగాంధీ ఢిల్లీ టెక్నికల్ యూనివర్శిటీ ఫర్ ఉమెన్ ఏడవ స్నాతకోత్సవంలో సక్సేనా మాట్లాడుతూ.. ‘ఢిల్లీ ముఖ్యమంత్రి మహిళ కావడం పట్ల ఈరోజు సంతోషంగా ఉన్నా.. బహుశా ఆమె తన పూర్వీకుల కంటే వెయ్యి రెట్లు మెరుగ్గా ఉన్నారని నేను నమ్మకంగా చెప్పగలను.’ అని అన్నారు.
Read Also: AV Ranganath : కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ సంచలన వ్యాఖ్యలు.. ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదు
కేజ్రీవాల్ అధికారంలో ఉన్న సమయంలో పాలన, బ్యూరోక్రసీ నియంత్రణతో సహా అనేక అంశాల్లో బీజేపీ, ఆప్ మధ్య విభేదాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలోనే సక్సేనా నుంచి వ్యాఖ్యలు వచ్చాయి. సెప్టెంబర్‌లో కేజ్రీవాల్ రాజీనామా చేసిన తర్వాత అతిషీ ఢిల్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేవారు. తాను రాజీనామా చేసిన తన అవినీతి ఆరోపణల గురించి ప్రజలనే ‘‘నిజాయతీ ధ్రువీకరణ’’ కోరుతానని కేజ్రీవాల్ రాజీనామా చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఆప్ అధినేత ఐదు నెలలకు పైగా జైలులో ఉన్నారు.