అస్సాంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 6 జిల్లాలో వరద నీరు పోటెత్తడంతో వందలాది గ్రామాలు నీటమునిగాయి. 24 వేల మంది కంటే ఎక్కువగా వరద నీటిలో చిక్కుకున్నట్లు అధికారులు అంచానా వేస్తున్నారు. అంతేకాకుండా వరదల ధాటికి ముగ్గురు ప్రాణాలు కొల్పోయారు. అస్సాంలోని పలు జిల్లాలో ఈదురు గాలులతో కూడి భారీ వర్షాలు అక్కడి ప్రజలను అతలాకుతలం చేశాయి. దీనితో పాటు 12 గ్రామాల్లో కొండ చరియలు విరిగి పడ్డాయి. వరద ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొన్ని జిల్లాలో దుకాణాలు, ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వరద ధాటికి ఎకరాల్లో పంట నీట మునిగింది. వరద నీటి ప్రభావంతో చెరువు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో.. కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
వరద ధాటికి రైల్వే ట్రాక్‌ను చెదిరిపోవడంతో రైళ్లను రద్దు చేశారు అధికారులు. కొన్ని రైల్లు వరద నీటిలో చిక్కుకుపోవడంతో.. ఆ రైళ్లలోని ప్రయాణికులకు అధికారులు.. ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్, తదితరల శాఖలతో కలిసి సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే కొందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు వారికి కావాల్సిన ఏర్పాట్లను చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి.. వారికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.