Asaduddin Owaisi: యూపీలో బీజేపీని ఓడిద్దాం.. అఖిలేష్‌కు ఓవైసీ ఆఫర్..
- యూపీలో సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు సిద్ధం..
- బహిరంగ ప్రకటన చేసిన ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ..
- ఓటు బ్యాంక్ రాజకీయాలని బీజేపీ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: 2027 ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అధికార బీజేపీతో పాటు సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) తమ ప్రచారాన్ని మొదలుపెట్టాయి. మరోవైపు, యూపీలో సత్తా చాటాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అఖిలేష్ యాదవ్‌తో పొత్తు కోసం ఓవైసీ బహిరంగ పిలుపు ఇచ్చారు. ఎస్పీతో తాము పొత్తుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
మొరాదాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఓవైసీ మాట్లాడుతూ.. ‘‘ఉత్తరప్రదేశ్‌లో మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడకూడదనేది మా లక్ష్యం. అందుకోసం చేతులు కలపడానికి, కూటమి ఏర్పాటు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎన్నికలు ముగిసిన తర్వాత బాధపడకుండా ఇప్పుడే చర్చలు ప్రారంభించాలి’’ అని అన్నారు. తాను పోటీ చేస్తే ఓట్లు చీలిపోతాయని చెబుతున్నారనని, అలాంటప్పుడు కలిసి పోటీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఓవైసీ అన్నారు. ఎంఐఎం పోరాటం ఏ మతానికి వ్యతిరేకం కాదని, గౌరవం, సమాన హక్కులు, న్యాయం కోసమే తమ పోరాటం అని చెప్పారు. అఖిలేష్ యాదవ్‌తో హక్కులు, న్యాయం గురించి చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఓవైసీ స్పష్టం చేశారు.
Also Read
- BJP: బీజేపీ పెద్ద లక్ష్యాల కోసం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చిన్న తాగ్యమా.?
- NEET Controversy: "రాజీనామాతో నా కూతురు తిరిగి రాదు.. దోషులను ఉరి తీయండి".. నీట్ బాధితురాలి తల్లి ఆవేదన..
- Rajnath Singh: భారత్ డేటా సెంటర్లు నిర్మిస్తే.. పాకిస్థాన్ ఉగ్రవాద కేంద్రాలు నిర్మిస్తోంది..
- Dharmendra Pradhan: షాకింగ్.. రెండు సార్లు రాజీనామా చేయడానికి ముందుకు వచ్చిన ధర్మేంద్ర ప్రధాన్ కానీ..
ఓవైసీ వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మాట్లాడుతూ.. ‘‘అఖిలేశ్ యాదవ్, ఓవైసీ ఇద్దరూ బుజ్జగింపు రాజకీయాల్లో పోటీ పడుతున్నారు. ఇప్పుడు ఆ పోటీని పక్కనబెట్టి కలిసి పనిచేయాలని చూస్తున్నారు. అందుకే ఓవైసీ అఖిలేశ్‌కు ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’ పంపుతున్నారు’’అని సెటైర్లు వేశారు. ఓవైసీ, అఖిలేష్ నాణానికి రెండు వైపుల లాంటి వారని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Asaduddin Owaisi: యూపీలో బీజేపీని ఓడిద్దాం.. అఖిలేష్‌కు ఓవైసీ ఆఫర్..
-
AP Rain Alert: ఉగ్రరూపం దాల్చిన సముద్రం.. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన..
-
BJP: బీజేపీ పెద్ద లక్ష్యాల కోసం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చిన్న తాగ్యమా.?
-
Ishan Kishan: బ్యాటింగ్‌లో విధ్వంసం, కీపింగ్‌లో మిస్టేక్.. ధోనీలా ట్రై చేసి ఫెయిల్ అయిన ఇషాన్ కిషన్..
-
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం తొలి వెబ్ సిరీస్.. షూటింగ్ పూర్తి, రిలీజ్ కోసం వెయిటింగ్
ట్రెండింగ్
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!