Sheikh Hasina: ‘‘హసీనాకు ఏమైనా జరిగితే..’’ బంగ్లాదేశ్ ప్రధానికి మాజీ అమెరికన్ అధికారి హెచ్చరిక!
- షేక్ హసీనాకు ఏదైనా జరిగితే తారిఖ్ రెహ్మన్దే బాధ్యత..
- బంగ్లాదేశ్ ప్రధానికి అమెరికా మాజీ రక్షణ అధికారి వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sheikh Hasina: పదవీచ్యుతురాలైన షేక్ హసీనా డిసెంబర్ 16న తన సొంత దేశం బంగ్లాదేశ్ వెళ్తున్నట్లు ప్రకటించింది. 2024 ఆగస్టులో హింసాత్మక విద్యార్థి ఉద్యమం తర్వాత ఆమె భారత్ వచ్చారు. రెండేళ్లుగా భారత్‌లోనే నివాసం ఉంటున్నారు. ఇప్పుడు వచ్చే నెల ఆమె బంగ్లాదేశ్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో హైటెన్షన్ నెలకొంది. ఇప్పటికే ఆ దేశంలో షేక్ హసీనా మద్దతుదారులు, అవామీలీగ్ కార్యకర్తలు తమ అధినేత రాక కోసం ఎదురుచూస్తు్న్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఘర్షణలు, బాంబు పేలుళ్లు చోటుచేసుకుంటున్నాయి.
ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్ వెళ్లిన తర్వాత షేక్ హసీనాకు ఏదైనా హాని జరిగితే అందుకు బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహ్మాన్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని అమెరికా రక్షణ శాఖ(పెంటగాన్) మాజీ అధికారి మైఖేల్ రూబిన్ హెచ్చరించారు. హసీనా విషయంలో భారత్ ఎలాంటి రాజీ పడకూడదని కూడా ఆయన సూచించారు. న్యూయార్క్‌లో జరిగిన ‘‘బంగ్లాదేశ్ ఫ్యూచర్’’ అనే సదస్సులో మైఖేల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన 2002 నుంచి 2004 వరకు పెంటగాన్‌లో పనిచేశారు. హసీనా తల నుంచి ఒక్క వెంట్రుకకు హాని జరిగినా అందుకు బాధ్యత తారిఖ్ రెహ్మన్‌తో పాటు ఆయన ప్రభుత్వమే అని అన్నారు.
Also Read
- IBM: H-1B వీసాదారులకు IBM షాక్.. అమెరికా వదిలి వెళ్లండి లేదా ఉద్యోగం మానేయండి!
- Space X Shares: ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన.. పిల్లలకూ స్పేస్ ఎక్స్ షేర్లు ఇస్తాం..
- Nvidia: చైనాకు AI చిప్‌లు చేరకుండా అమెరికా వ్యూహం.. నాలుగు దేశాలకు ఎన్విడియా షాక్!
- US Birthright Citizenship Row: ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ.. జన్మహక్కు పౌరసత్వంపై అమెరికా కోర్టు కీలక తీర్పు
మరోవైపు, హసీనా రాకపై బంగ్లాదేశ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. ఇన్నాళ్లు బంగ్లాదేశ్ హసీనాను పంపించాలని భారత్‌పై ఒత్తిడి తీసుకువచ్చింది. ఇప్పుడు స్వయంగా ఆమె బంగ్లాదేశ్ వస్తానని చెబితే, ఆమె సాధారణ ప్రయాణికురాలిగా రావడానికి వీల్లేదని, నేరస్తుల్లా ‘‘అప్పగింత ప్రక్రియ’’ ద్వారా మాత్రమే రావాలని బంగ్లా విదేశాంగ సహాయమంత్రి హుమాయున్ కబీర్ వ్యాఖ్యానించారు. హసీనాను ఉగ్రవాదిగా అభివర్ణిస్తూ.. ఆమె చేతికి సంకెళ్లు వేసి మాత్రమే తీసుకురాగలం అని అన్నారు.
తాజావార్తలు
-
Sheikh Hasina: ‘‘హసీనాకు ఏమైనా జరిగితే..’’ బంగ్లాదేశ్ ప్రధానికి మాజీ అమెరికన్ అధికారి హెచ్చరిక!
-
Tollywood: 2027 సంక్రాంతి బాక్సాఫీస్ యుద్ధం.. బరిలో ఏడు సినిమాలు
-
Pa.Ranjith: రాజ్యాంగం కేవలం చట్టాల పుస్తకం కాదు.. అణగారిన వర్గాల గొంతుక! పా.రంజిత్ ట్వీట్ వైరల్..
-
Paternity Leave: తమిళనాడులో తండ్రులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగులకు 15 రోజుల పితృత్వ సెలవు!
-
Vasantha Haimavathi Passes Away: ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఫ్యామిలీలో విషాదం..
ట్రెండింగ్
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
-
Apple Kukatpally: హైదరాబాద్‌లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!