ఎప్పుడు ఏదో ఓ రాజకీయ అంశంపై కీలక వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. మహారాష్ట్ర బివండీలో శనివారం ఓ సభలో ప్రసంగించారు. నిజానికి భారత దేశం ద్రవిడియన్లు, ఆదివాసీలది అని కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశం నాది కాదు, మోదీ- షాలది కాదు, ఠాక్రేలది కాదని.. ద్రవిడియన్లు, ఆదివాసీలది మాత్రమే అని ఆయన అన్నారుు. మొగల్స్ తరువాతే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఉన్నాయని అసదుద్దీన్ అన్నారు. ఆఫ్రికా, మధ్య ఆసియా, ఇరాన్, తూర్పు ఆసియా…