Rahul Gandhi: ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా లోక్‌సభలో ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌పై సంచలన ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ ‘‘మద్యం కుంభకోణానికి మూలకర్త’’ అని దుయ్యబట్టారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం రాహుల్ గాంధీ పట్పర్ గంజ్లో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.