Bengaluru Techie Suicide Case: 3 రోజుల్లో రావాలి.. అతుల్ సుభాష్ భార్యకి పోలీస్ సమన్లు..
- బెంగళూర్ టెక్కీ సూసైడ్ కేసులో కీలక పరిణామం..
- అతుల్ సుభాష్ భార్య నికితా సింఘానియాకు పోలీసుల సమన్లు..
- 3 రోజుల్లో విచారణకు హాజరుకావాలని ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru: భార్య, ఆమె కుటుంబం వేధింపుల భరించేలేక ఆత్మహత్య చేసుకున్న బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అక్రమ వరకట్న వేధింపుల కారణంగా తాను చనిపోతున్నట్లు సుభాష్ 24 పేజీల లేఖ, గంటలకు పైగా వీడియోను రికార్డ్ చేసి సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కేసు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు వరకట్న, గృహహింస సెక్షన్ 498ఏని సమీక్షించాలని పలువురు కోరుతున్నారు. కొందరు మహిళలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం చట్టాన్ని మిస్ యూజ్ చేస్తున్నారని మండిపడుతున్నారు.
Read Also: Allu Arjun: స్విమ్మింగ్ పూల్ లో అల్లు అర్జున్.. పోలీసుల రాకతో షాక్!
Also Read
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
- Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
- Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
ఇదిలా ఉంటే, ఈ కేసులో ఉత్తర్ ప్రదేశ్‌లోని జౌన్ పూర్‌లో ఉంటున్న అతుల్ భార్య నికితా సింఘానియా, ఆమె కుటుంబానికి బెంగళూర్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. బెంగళూరులోని మారతహళ్లి పోలీస్ స్టేషన్ ముందు హాజరు కావడానికి వారికి 3 రోజుల సమయం ఇచ్చారు. బాధితుడు సుభాష్ సోదరుడు బికాస్ కుమార్ ఫిర్యాదు మేరకు నలుగురు సభ్యులతో కూడిన బెంగళూర్ పోలీస్ టీం, యూపీ జౌన్‌పూర్‌లోని నిఖితా నివాసానికి వెళ్లి నోటీసులు అంటించారు. ఈ కేసులో అతుల్ సుభాష్ భార్య నికితా సింఘానియా, ఆమె తల్లి నిషా సింఘానియా, ఆమె సోదరుడు అనురాగ్ సింఘానియా, ఆమె మేనమామ సుశీల్ సింఘానియాలకు నోటీసులు జారీ చేశారు. ‘‘వాస్తవాలు, పరిస్థితుల్ని నిర్ధారించేందుకు మిమ్మల్ని విచారించడానికి కారణాలు ఉన్నాయి. 3 రోజుల్లోగా బెంగళూర్‌లోని దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాలి’’ అని నోటీసుల్లో పేర్కొన్నారు.
బీహార్‌కి చెందిన 34 ఏళ్ల అతుల్ సుభాష్, యూపీ జౌన్‌పూర్‌కి చెందిన నికితా సింఘానియాని 2019లో పెళ్లి చేసుకున్నాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సుభాష్ బెంగళూర్‌లో నివాసం ఉంటున్నాడు. అతడికి నాలుగేళ్ల బాబు కూడా ఉన్నాడు. 2021లో నిఖితా, అతుల్‌ని కాదని పుట్టింటికి వెళ్లింది. అతడిపై వరకట్న వేధింపులు, గృహహింస సెక్షన్ల కింద కేసు పెట్టింది. నెలకు రూ. 2-4 లక్షల భరణాన్ని డిమాండ్ చేసింది. కేసును పరిష్కరించేందుకు రూ. 3 కోట్లు కావాలని నిఖితా కుటుంబం వేధించినట్లు అతుల్ ఆరోపించాడు. నిర్దోషినైనా తనకు కాకుండా న్యాయవ్యవస్థ ఆమెకే అండగా నిలిచిందని, చివకు జడ్జి కూడా కేసు సెటిల్మెంట్‌కి డబ్బులు అడిగినట్లు ఆరోపించారు.
తాజావార్తలు
-
Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
-
Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Radeon 2026 Launched: పండుగ సీజన్లో TVS కొత్త బైక్ లాంచ్.. 69.3 కి.మీ. మైలేజ్.. ధర రూ.67 వేల నుంచే స్టార్ట్..
-
ICC Awards: శుభ్‌మన్ గిల్, షెఫాలి వర్మలకు అవార్డులు..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!