ఢిల్లీ బ్లాస్ట్ కేసులో మరొక కీలక నిందితుడిని దర్యాప్తు అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ పేలుడుకు ముందు ఉగ్రవాది ఉమర్‌కు ఆశ్రయం ఇచ్చిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఫరీదాబాద్‌కు చెందిన సోయబ్‌ను ఎన్ఐఏ అధికారులు అరస్ట్ చేశారు. ఉగ్ర డాక్టర్ ఉమర్‌కు లాజిస్టిక్ సాయం అందించినట్లుగా విచారణలో గుర్తించారు. ప్రస్తుతం సోయబ్‌ను అధికారులు విచారిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Gold Rates: గోల్డ్ లవర్స్‌కు మళ్లీ షాక్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
నవంబర్ 10న ఎర్రకోట దగ్గర కారు బ్లాస్ట్ జరిగింది. ఈ ఘటనలో 15 మంది చనిపోగా.. అనేక మంది గాయాలు పాలయ్యారు. అనంతరం దర్యాప్తు అధికారులు విచారణ చేపట్టగా.. ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ యూనివర్సిటీ కేంద్రంగా జరిగిన ఉగ్ర కుట్ర బయటపడింది. ఉగ్రవాదులు షాహీన్, ముజమ్మిల్, ఉమర్ ముగ్గురు కలిసి దేశ వ్యాప్త ఉగ్ర దాడులకు కుట్ర చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.
ఇది కూడా చదవండి: Smriti Mandhana-Palak: షాకింగ్ న్యూస్.. స్మృతి మంధానని మోసం చేసిన పలాశ్, స్క్రీన్‌షాట్‌లు వైరల్