ఢిల్లీ బ్లాస్ట్ కేసులో మరొక కీలక నిందితుడిని దర్యాప్తు అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ పేలుడుకు ముందు ఉగ్రవాది ఉమర్‌కు ఆశ్రయం ఇచ్చిన వ్యక్తిని అరెస్ట్ చేశారు.
Delhi Car Blast: ఢిల్లీ ఎర్రకోట కార్ బ్లాస్ట్ కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా, ఈ ‘‘వైట్ కాలర్’’ మాడ్యుల్‌తో సంబంధం ఉన్న మరో మహిళా వైద్యురాలిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జమ్మూ కాశ్మీర్ పోలీసుల కౌంటర్-ఇంటెలిజెన్స్ బృందాలు అనంత్‌నాగ్‌లోని మలక్‌నాగ్ ప్రాంతంలోని ఒక హాస్టల్ పై దాడులు చేశారు. ఈ దాడుల్లో హర్యానా రోహ్‌తక్‌కు
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన ఉగ్రవాద దాడితో దేశం ఉలిక్కిపడింది. ఈ ఘటనలో 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు, కేంద్ర బలగాలు నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా ఈ ఘటనపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ఢిల్లీ పేలుళ్ల ఘటనను తీవ్రంగా ఖండించారు. అమాయక ప్రజలను ఇంత దారుణంగా చంపడాన్ని ఏ మతం కూడా సమర్థించదని అన్నారు.…
ఢిల్లీ పేలుడుపై దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తులో అనేక కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తవ్వేకొద్దీ ఉగ్ర కుట్ర కోణాలు బయటకు వస్తున్నాయి. ఉగ్రవాది ఉమర్‌కు సంబంధించిన విషయాల్లో అంతర్జాతీయంగా జరిగిన కుట్ర వెలుగులోకి వచ్చింది.
Delhi Blast Case: ఢిల్లీ పేలుళ్ల కేసులో మరో సంచలన అంశం బయటపడింది. ఉగ్రవాది డాక్టర్ షాహీన్ సిద్ధిఖీ రెండు నెలల క్రితం లక్నోకు వెళ్లి అనేక మంది అనుమానాస్పద వ్యక్తులను కలిసిందని దర్యాప్తులో తేలింది. ఆమె పరిచయస్తులలో కొందరు అయోధ్య రామాలయాన్ని సైతం సందర్శించారని వర్గాలు చెబుతున్నాయి. లక్నోలో షాహీన్ ఎవర్ని కలిసింది? ఆమె ఎక్కడ బస చేసింది? అయోధ్యలో ఏదైనా కుట్ర జరిపారా..? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. ఆమె లక్నోకు వచ్చినట్లు జమ్మూకశ్మీర్…