మరికొన్ని గంటల్లో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి. చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు. ఇందుకోసం ముంబైలో గ్రాండ్‌గా ఏర్పాట్లు చేశారు. ఇక మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు దేశ, విదేశాల నుంచి వీఐపీలు హాజరవుతున్నారు.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: ఆదాయం తెచ్చిపెట్టే వనరులపై నిక్కచ్చిగా ఉండాలి..
ఇదిలా ఉంటే అంబానీ ఫ్యామిలీ.. ఉద్యోగుల్ని కూడా కుటుంబ సభ్యులుగా భావించి వారికి కూడా ప్రత్యేక మైన గిఫ్ట్‌లు పంపించారు. రిలయన్స్ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు వెడ్డింగ్ గిఫ్ట్‌లు పంపించారు.
ఇది కూడా చదవండి: Rajnath Singh: రక్షణశాఖ మంత్రికి అస్వస్థత.. ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన రాజ్ నాథ్ సింగ్..!
ఎరుపు రంగు బాక్స్‌పై బంగారు రంగు అక్షరాలతో అనంత్-రాధిక పేర్లు ఉన్నాయి. ఇక ఆ బాక్సులో నాలుగు రకాల తినుబండారాలు ఉన్నాయి. ఆలూ భుజియా, మురుకులు, చిడ్వాతో పాటు ఓ సిల్వర్ కాయిన్‌ను రిలయన్స్ ఉద్యోగులకు అందించారు. తమ యజమానులు పంపిన కానుకలను కొందరు ఉద్యోగులు పంచుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.