Earthquake: ఢిల్లీ-ఎన్‌సీఆర్ తర్వాత ఉత్తరాఖండ్‌లో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. ఈ భూకంప ప్రకంపనలు పితోర్‌ఘర్ జిల్లాకు ఈశాన్యంగా 48 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు భావించారు.
ఉత్తర భారతాన్ని భూకంపాలు వణికిస్తున్నాయి. నేపాల్‌లో 6.2 భూకంపం సంభవించిన కొన్ని గంటల తర్వాత ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భూప్రకంపనలు అక్కడి ప్రజలను భయాందోళనకు గురిచేశాయి.
An earthquake hits Uttarakhand:ఉత్తరాఖండ్‌లో భూకంపం సంభవించింది. డెహ్రాడూన్ తో పాటు పలు నగరాల్లో భూకంపం వచ్చింది. ఆదివారం ఉదయం 8.33 గంటల ప్రాంతంలో భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రిక్టర్ స్కేల్ పై 4.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది.