Amit Shah: రాహుల్ బాబా మేముండగా ఆ పని ఎన్నటికీ జరగదు..
- రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై అమిత్ షా ఫైర్..
- తాము ఉండగా రిజర్వేషన్లను రద్దు చేయనివ్వబోము..
- ఆర్టికల్ 370 ఎన్నడూ తిరిగి రాలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: రిజర్వేషన్లపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) నాయకుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరారీలు, గుజ్జర్లు, దళితులతో సహా అణగారిని వర్గాలకు రిజర్వేషన్లు అలాగే ఉంటాయని అమిత్ షా హమీ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో నౌషేరాలో జరిగిన ర్యాలీలో అమిత్ షా ప్రసంగించారు. రిజర్వేషన్లు అవసరం లేదని రాహుల్ గాంధీ అమెరికాలో చేసిన ప్రకటనని ప్రస్తావిస్తూ.. రిజర్వేషన్లను తొలగించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
Read Also: Indian Railways: టిక్కెట్ లేకుండా జనరల్ కోచ్లో ప్రయాణిస్తున్నారా..? ఫైన్ ఎంతో తెలుసా..?
Also Read
- High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్‌డీఏకు హైకోర్టు షాక్..!
- India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
- Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
- NEET PG 2026 Exam: నేడే నీట్ పీజీ 2026 ప్రవేశ పరీక్ష.. అభ్యర్థులు ఈ తప్పులు చేయకండి.. కీలక మార్గదర్శకాలు
“పహారీ, గుజ్జర్ బకర్వాల్, దళితులు, వాల్మీకి, ఓబీసీ వర్గాలకు ఇచ్చిన రిజర్వేషన్‌పై పునరాలోచన చేస్తామని కాంగ్రెస్, ఎన్‌సీ చెప్పాయి. రాహుల్ గాంధీ అమెరికా వెళ్లి ఇప్పుడు వాళ్లు అభివృద్ధి చెందారని, ఇప్పుడు రిజర్వేషన్ అవసరం లేదని చెప్పారు. రాహుల్ బాబా, మేము మిమ్మల్ని రిజర్వేషన్‌ని తీసివేయనివ్వము’’ అని అమిత్ షా అన్నారు. రిజర్వేషన్లు యథాతథంగా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని ఎన్సీ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురాలేరు అని పేర్కొన్నారు.
ప్రధాని మోడీ హయాంలో జమ్మూ కాశ్మీర్ రాళ్ల దాడిని లేదని, ఉగ్రవాదుల్ని విడుదల చేయలేదని అమిత్ షా అన్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించే వరకు పాకిస్తాన్‌తో చర్చలు ఉండవని చెప్పారు. పాకిస్తాన్‌తో కాకుండా మేము కాశ్మీర్ యువతతో మాట్లాడుతామని చెప్పారు. టెర్రరిస్టులు, రాళ్లు రువ్వే వారి విడుదలకు ఎన్సీ-కాంగ్రెస్ కూటమి మద్దతిస్తోందని హోం మంత్రి ఆరోపించారు. ఉగ్రవాదాన్ని భూమిలో పాతిపెడుతామని వార్నింగ్ ఇచ్చారు.
తాజావార్తలు
-
TVS, Vida, Zelio, Bounce: బడ్జెట్లో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. రూ.36,000కే చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్..!
-
APFDC: సినిమా షూటింగ్స్‌కు సింగిల్ విండో.. విశాఖను ఫిల్మ్ హబ్‌గా మార్చేందుకు కీలక నిర్ణయాలు
-
Rajamahendravaram: గోదావరిలో హౌస్‌బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
-
Mamitha Baiju : రెమ్యునరేషన్ పెంచేసిన మమిత బైజు.. రూ. 3 కోట్లు డిమాండ్?
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్ తో రూ.27 కోట్ల వసూళ్లు.. ఊహించని హిట్ అందుకున్న ‘హనుమాన్ అంశ్’
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!