Rajamahendravaram: గోదావరిలో హౌస్‌బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Godavari River Tourism: గోదావరి తీరంలో పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు కొత్త సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. రాజమహేంద్రవరంలో తొలిసారిగా హౌస్‌బోట్, ఫ్లోట్ ఇన్ డైన్ సేవలను ప్రారంభించారు. దీంతో గోదావరి పర్యాటకానికి మరింత ఆకర్షణ పెరగనుంది. హౌస్‌బోట్‌లో గోదావరి నదిపై విహరిస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సూర్యోదయం, సూర్యాస్తమయ దృశ్యాలను నది మధ్య నుంచి వీక్షించడంతో పాటు.. రాత్రి వేళల్లో గోదావరి మధ్యలోనే బస చేసే ప్రత్యేక అనుభూతిని కూడా పర్యాటకులు పొందవచ్చు.
కుటుంబ సభ్యులతో కలిసి విహారానికి వెళ్లేవారికి, ప్రత్యేక సందర్భాలను జరుపుకునే వారికి ఈ హౌస్‌బోట్ ఆకట్టుకోనుంది. నదీ ప్రయాణంతో పాటు ప్రశాంతమైన వాతావరణంలో కొంత సమయం గడిపే అవకాశం ఉండటంతో సందర్శకులకు ఇది కొత్త అనుభూతిని అందించనుంది. మరోవైపు కుటుంబ వేడుకలు, పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, ఇతర ప్రత్యేక సందర్భాల కోసం ఫ్లోట్ ఇన్ డైన్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. నదీ మధ్యలో క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేసుకుని ప్రత్యేకమైన సందర్భాలను మరింత మధురంగా జరుపుకునేలా ఈ సదుపాయాన్ని తీర్చిదిద్దారు.
Also Read
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
ప్రస్తుతం ఇలాంటి సేవలు విజయవాడ, దిండి ప్రాంతాల్లో అందుబాటులో ఉండగా.. రాజమహేంద్రవరంలో మాత్రం తక్కువ ధరలకు అందిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులను కూడా ఆకర్షించే అవకాశం ఉంది. గోదావరి పుష్కరాల నేపథ్యంలో పర్యాటకులను పెద్దఎత్తున ఆకర్షించేందుకు ఈ కొత్త సేవలను ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. పుష్కరాల సమయంలో రాజమహేంద్రవరానికి వచ్చే సందర్శకులకు గోదావరి విహారం మరో ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. ఇప్పటికే గోదావరి తీరంలోని ప్రకృతి సౌందర్యం, చారిత్రక ప్రదేశాలు పర్యాటకులను ఆకట్టుకుంటుండగా.. హౌస్‌బోట్, ఫ్లోట్ ఇన్ డైన్ సేవలు అందుబాటులోకి రావడంతో నగర పర్యాటక రంగానికి కొత్త ఊపు వస్తుందని స్థానికులు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని వాటర్ టూరిజం సదుపాయాలు అందుబాటులోకి వస్తే రాజమహేంద్రవరం ప్రముఖ పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
-
Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
-
Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!