అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం యావత్తు దేశాన్ని కాదు.. ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. విమానం టేకాఫ్ అయిన కొద్ది సెకన్లలోనే ఎయిరిండియా విమానం అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో హాస్టల్‌పై కుప్పకూలిపోయింది. ఒక్క ప్రయాణికుడు మినహా 241 మంది ప్రయాణికులు చనిపోయారు. హాస్టల్‌లో ఉన్న 35 మంది మెడికోలు కూడా ప్రాణాలు వదిలారు. ఈ ఘటన ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇక ఎయిరిండియాకు చెందిన సంస్థ మృతుల కుటుంబాలకు రూ.కోటి నష్ట పరిహారం ప్రకటించింది. తక్షణ సాయం కింద రూ.25 లక్షలు అందిస్తామని వెల్లడించింది. తాజాగా ఈ పరిహారం అందజేసే విషయంలో ఎయిరిండియా ఇబ్బందులకు గురి చేస్తోందంటూ బాధిత కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి.
ఇది కూడా చదవండి: Love Marriage: లవ్ మ్యారేజ్.. ఏడాది కూడా గడవకముందే దారుణం.. అసలు ఏం జరిగిందంటే?
పరిహారం అందజేయాలంటే మృతుల కుటుంబాల ఆర్థిక వివరాలు బహిర్గతం చేయాలని ఎయిరిండియా ఒత్తిడి చేస్తోందంటూ బ్రిటన్‌కు చెందిన న్యాయసంస్థ స్టీవర్ట్స్ ఆరోపించింది. మా క్లయింట్‌కు ఎయిరిండియా కొన్ని ప్రశ్నలు సంధించిందని.. అందులో వ్యక్తిగత వివరాలతో పాటు ఆర్థిక సమాచారాన్ని కోరిందని తెలిపింది. మృతుల కుటుంబాల ఆర్థిక పరిస్థితులు ఎయిరిండియాకు ఏం అవసరం వచ్చిందని ప్రశ్నించింది. దరఖాస్తును చూసి షాక్ అయినట్లు పేర్కొంది.
ఇది కూడా చదవండి: Gold Rates: ఆషాడ మాసం వేళ.. భారీగా తగ్గిన బంగారం ధరలు..
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు జాతీయ, అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎయిరిండియా స్పందించింది. కేవలం మృతులతో దరఖాస్తుదారులకు ఉన్న సంబంధాలు తెలుసుకునేందుకు మాత్రమే ప్రశ్నావళిని పంపించామని.. అంతే తప్ప వేరే ఉద్దేశం లేదని చెప్పింది. ఇలాంటి విషయాల్లో కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందనే విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరింది. ఇందుకోసం బాధిత కుటుంబాలకు కావాల్సినంత సమయం ఇస్తున్నామని.. అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎయిరిండియా స్పష్టం చేసింది. ఇప్పటికే 47 కుటుంబాలకు తాత్కాలిక చెల్లింపులు చేసినట్లు వెల్లడించింది.
జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఎయిరిండియా విమానం బయల్దేరింది. కొన్ని సెకన్లలోనే హాస్టల్‌పై కూలిపోయింది. విమానంలో ఒక్కరు మినహా 241 మంది ప్రయాణికులు చనిపోయారు. ఇక హాస్టల్‌లో ఉన్న 34 మంది మెడికోలు చనిపోయారు. ఇక విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా చనిపోయారు. కుమార్తెను చూసేందుకు లండన్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విమాన ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు కాగా.. 53 మంది బ్రిటన్ పౌరులు, ఏడుగురు పోర్చుగీస్ జాతీయులతో పాటు ఒక కెనడా వాసి ఉన్నట్లు ఎయిరిండియా వెల్లడించింది.