నిన్న భారీగా పెరిగి షాకిచ్చిన బంగారం ధరలు నేడు ఊరటనిచ్చాయి. ఇవాళ పసిడి ధరలు భారీగా తగ్గాయి. తులం గోల్డ్ ధర నేడు రూ. 600 తగ్గింది. సిల్వర్ ధరలు కూడా బంగారం బాటలోనే పయనించాయి. ఆషాడం వేళ పుత్తడి ధరలు తగ్గుతుండడంతో కొనుగోలుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,873, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,050 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 550 తగ్గింది. దీంతో రూ.90,500 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 600 తగ్గింది. దీంతో రూ. 98,730 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
Also Read:OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు.. వెబ్ సిరీస్ లు ఇవే
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 90,650 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 98,880 వద్ద ట్రేడ్ అవుతోంది. నేడు సిల్వర్ ధరలు భారీగా తగ్గాయి. కిలో వెండిపై రూ. 1000 తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,20,000 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,10,000 వద్ద ట్రేడ్ అవుతోంది.