Air India: టీ 20 ప్రపంచకప్ విజయం తర్వాత భారత క్రికెట్ జట్ట కరేబియన్‌లోనే చిక్కుకుపోయింది. తుఫాను రావడంతో ఆ ప్రాంతంలో ఫ్లైట్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఫలితంగా టీమిండియా అక్కడే చిక్కుకుపోయింది. టీ 20 కప్ సాధించిన భారత క్రికెటర్లకు స్వాగతం పలిచేందుకు ఫ్యాన్స్ ఎదురుచూడాల్సి వచ్చింది. తాజాగా ఈ రోజు భారత క్రికెట్ జట్టు స్వదేశానికి చేరుకుంది. బుధవారం బార్బడోస్ నుంచి ఎయిర్ ఇండియా విమానం బయలుదేరి, ఈ రోజు ఢిల్లీ చేరుకుంది.
ఇదిలా ఉంటే, ఇప్పుడు ఏయిరిండియా ఒక వివాదంలో ఇరుక్కుంది. బార్బడోస్ నుంచి టీమిండియాను తీసుకురావడానికి అమెరికాకు నుంచి షెడ్యూల్ చేసిన విమానాన్ని రద్దు చేసింది. వాస్తవానికి నెవార్క్- ఢిల్లీ మధ్య ఎయిరిండియా బోయింగ్ -777 విమానాన్ని నడపాల్సి ఉంది. అయితే, దీనిని క్యాన్సల్ చేసినట్లు నివేదికలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) దీనిపై నివేదిక కోరింది.
Read Also: NEET Paper Leaks Case: నీట్ పేపర్ లీకేజీకి నిరసన.. నేడు దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్..
నిజానికి అమెరికాలోని నెవార్క్ నుంచి ఢిల్లీకి రెగ్యులర్ ఫ్లైట్ నడపాల్సి ఉంది. వాస్తవాలను నిర్ధారించేందుకు ఎయిరిండియాను నివేదిక కోరినట్లు డీజీసీఏ అధికారి వెల్లడించారు. విమానయాన నిపుణుడు మోహన్ రంగనాథన్ మాట్లాడుతూ విమానాన్ని రద్దు చేయడం డిజిసిఎ పౌర విమానయాన నిబంధనలను (సిఎఆర్) తీవ్రంగా ఉల్లంఘించడమేనని అన్నారు.
దీనిపై విషయం తెలిసిన ఎయిర్‌లైన్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. వాస్తవానికి భారత క్రికెట్ జట్టు ప్రయాణించాల్సిన విమానయాన సంస్థ సదరు విమానాన్ని రద్దు చేయాల్సి వచ్చింది, ఆ తర్వాత బీసీసీఐ ఎయిర్ ఇండియాను సంప్రదించినట్లు చెప్పారు. అయితే, నెవార్క్ విమానాశ్రయంలో ప్రయాణికులు ఎవరూ చిక్కుకోలేదని స్పష్టం చేశారు. నెవార్క్-ఢిల్లీ ఫ్లైట్‌లో బుక్ చేసుకున్న ప్రయాణీకులందరికీ ముందుగానే సమాచారం అందించబడింది మరియు అసౌకర్యాన్ని తగ్గించడానికి ప్రత్యామ్నాయం కూడా అందించబడ్డాయని పేర్కొన్నాడు. కొంతమంది ప్రయాణీకులకు సమాచారం గురించి తెలియబడలేదని, వారు విమానాశ్రయం చేరుకోగానే, వారిని రోడ్డు మార్గం ద్వారా న్యూయార్క్ తరలించి అక్కడ నుంచి న్యూయార్క్-ఢిల్లీ ఫ్లైట్‌లో ఎక్కించినట్లు చెప్పారు.