Ahmedabad Plane Crash: విమాన ప్రమాదంపై తుది నివేదిక వచ్చేది ఎప్పుడంటే..!
- అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఇంకా వెలువడని తుది నివేదిక
- ఈ ఏడాది చివరి నాటికి వచ్చే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగి 3 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు తుది నివేదిక రాలేదు. ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు సంస్థలు ఇంకా బయటపెట్టలేదు. ఏఏఐబీ మాత్రం 15 పేజీల ప్రాథమిక రిపోర్టును బయటపెట్టింది. ఈ నివేదికలో ఇంధన స్విచ్‌లు దగ్గర సమస్య వచ్చినట్లుగా పేర్కొంది. రెండు స్విచ్‌లు ఆగిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా పేర్కొంది. అయితే ఈ స్విచ్‌లను ఫైలట్ ఉద్దేశపూర్వకంగానే ఆపేసినట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు పేర్కొన్నాయి. అయితే ఈ వాదనలను పైలట్ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. తుది నివేదిక రాకుండా తప్పుడు కథనాలు ఎందుకు ప్రచారం చేస్తారంటూ మండిపడ్డాయి.
ఇది కూడా చదవండి: Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. యాంటీఫాను ఉగ్రవాద సంస్థగా ప్రకటన
Also Read
- India-UK: జూలై 15 నుంచి స్వేచ్ఛా వాణిజ్య అమలు.. ఏవేవి తగ్గనున్నాయంటే..!
- Ghaziabad Jewelry Heist: మందు పార్టీ ఇచ్చి మరీ రూ.4 కోట్లు లేపేశాడు.. ప్రియురాలి కోసం ప్రియుడు వేసిన 'గోల్డెన్' స్కెచ్!
- Akash Deep Wedding: టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇంట పెళ్లి బాజాలు.. పూర్తి షెడ్యూల్ విడుదల
- Rahul Gandhi: భారత విద్యా వ్యవస్థ పిల్లల్ని అణచివేస్తోంది.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
అయితే ఎయిరిండియా విమాన ప్రమాదంపై ఏఏఐబీ తుది నివేదికను ఈ ఏడాది చివరి నాటికి సమర్పించే అవకాశం ఉన్నట్లు వర్గాలు పేర్కొన్నాయి. దర్యాప్తు చివరి దశకు వచ్చిందని.. ఈ సంవత్సరం చివరి నాటికి తుది నివేదికను సమర్పించే అవకాశం ఉందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వర్గాలు మీడియాతో పేర్కొన్నాయి. రెండు బ్లాక్ బాక్స్‌లపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని.. ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రెండింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Viral video: రైలు కింద పడుకున్నా ఏం కాలేదంటే… నువ్వు నిజంగా దేవుడివి స్వామి..
జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఎయిరిండియా విమానం లండన్‌కు బయల్దేరింది. టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే విమానం సమీపంలోని హాస్టల్‌పై కూలిపోయింది. ఒక్కరు మినహా విమానంలో ఉన్న 241 మంది చనిపోయారు. హాస్టల్‌లో మెడికోలు కూడా చనిపోయారు. ఇలా మొత్తం 271 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు ఎయిరిండియా రూ.కోటి పరిహారం అందించింది.
తాజావార్తలు
-
DA Hike: విద్యుత్ ఉద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్..
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Off The Record: సత్యవేడు టీడీపీలో ఆల్ సెట్ అయినట్టేనా..?
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
India-UK: జూలై 15 నుంచి స్వేచ్ఛా వాణిజ్య అమలు.. ఏవేవి తగ్గనున్నాయంటే..!
ట్రెండింగ్
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్‌తో రోజంతా ఫ్రెష్‌గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్‌పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!