Agnipath Bharat Bandh: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా భారత్ బంద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశానికి సేవలు అందించాలనే ఆసక్తిగల యువతను త్రివిధ దళాల్లో నియమించేందుకు కేంద్రం తాజాగా ‘అగ్నిపథ్’ పథకం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి దేశవ్యాప్తంగా యువత నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కేవలం నాలుగేళ్లు సైనిక సర్వీసులో ఉంచి.. ఆ తరువాత ఇంటికి పంపిస్తే తమ భవిష్యత్తు ఏమవుతుందని? ఆర్మీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ప్రశ్నిస్తూ.. నిరసనలు చేస్తున్నారు. తాజాగా అగ్నిపథ్ ఆందోళన హైదరాబాద్‌కు కూడా పాకింది.
కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా బిహార్, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో వందల సంఖ్యలో యువకులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తక్షణమే అగ్నిపథ్ పథకంను కేంద్రం ఉపసంహరించుకోవాలని దేశవ్యాప్తంగా యువత డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో నేడు భారత్ బంద్‌కు ఆందోళనకారులు పిలుపునిచ్చారు. బిహార్లో ఆందోళన చేస్తున్న యువకులు ఈ బంద్‌కు పిలుపునిచ్చారు. దీనికి ఆర్జేడీ మద్దతు ప్రకటించింది. ఈ బంద్‌కు పలు ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలిపాయని తెలుస్తోంది.
Also Read
- Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
- Essential Commodity Prices: వంటింట్లో మంటలు.. 42 వస్తువుల్లో 41 ధరలు పెరుగుదల..! నిత్యావసరాల తాజా లెక్కలివే
- L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
- Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
Navy Chief: అగ్నిపథ్.. భారత సైన్యంలో అతిపెద్ద రిక్రూట్‌మెంట్ స్కీమ్
అగ్నిపథ్ విధానంపై దేశంలోని నిరుద్యోగ యువత నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. శాశ్వతంగా సైన్యంలో చేరాలనుకునే తమ కలలను నీరుగార్చే విధంగా కేంద్రం నిర్ణయం ఉందని వారు అంటున్నారు. నాలుగేళ్ల షార్ట్ సర్వీస్ తర్వాత మళ్లీ సాధారణ నిరుద్యోగుల్లా ఇతరులతో తాము పోటీ పడాలా? ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే నిససనలు చేపట్టి విధ్వంసాలకు పాల్పడుతున్నారు. ప్రత్యేకించి యూపీ, బిహార్, తెలంగాణ యువత నుంచి అగ్నిపథ్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. శుక్రవారం ఆందోళనకారులు రైల్వే స్టేషన్లలోకి ప్రవేశించి రైళ్లకు నిప్పంటించారు. చాలా బోగీలను తగలబెట్టారు. రైల్వే స్టేషన్లలోని దుకాణాలను ధ్వంసం చేశారు. పోలీసులు వీరిని అదుపు చేసేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు. బాష్పవాయువు కూడా ప్రయోగించారు. దీంతో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. సైనిక నియామకాలు పాత పద్ధతిలోనే చేపట్టాలని, కొత్త విధానాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!