Delhi Mayor Election: ఢిల్లీ మేయర్ పీఠాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధిష్టించింది. ఆప్ కు చెందిన షెల్లీ ఒబెరాయ్ ఢిల్లీ మేయర్ గా ఎన్నికయ్యారు. బీజేపీ అభ్యర్థి శిఖా రాయ్ తన నామినేషన్ను ఉపసంహరించుకోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన షెల్లీ ఒబెరాయ్ ఈరోజు ఢిల్లీ మేయర్గా తిరిగి ఎన్నికయ్యారు. దీంతో ఒబెరాయ్ రెండోసారి మేయర్ గా ఎన్నికయ్యారు. షెల్లీ ఒబెరాయ్ కష్టపడి పనిచేయాలని ప్రజల అంచనాలను అందుకోవాలని ట్వీట్ చేశారు.
Read Also: Rice Shortage: ప్రపంచవ్యాప్తంగా బియ్యం కొరత. గడచిన 20 ఏళ్లలో ఎన్నడూ లేనంత..
జాతీయ రాజధాని ఢిల్లీ మేయర్ పదవి ఐదేళ్లు కొనసాగుతుంది. అయితే ప్రతీ ఏడాది రిజర్వేషన్ పద్దతిలో మేయర్లు మారుతుంటారు. మొదటి ఏడాది మహిళలకు, రెండో ఏడాది ఓపెన్ కేటగిరి, మూడో ఏడాది రిజర్వ్డ్ కేటగిరికి, మిగిలిన రెండేళ్లు ఓపెన్ కేటగిరికి రిజర్వ్ చేయబడుతాయి. స్టాండింగ్ కమిటీ ఎన్నికలు నిర్వహించనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒబెరాయ్ వెల్లడించారు. ఆమెతో పాటు డిప్యూటీ మేయర్ అలీ మహ్మద్ ఇక్బార్ మరోసారి ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్ పదవికి బీజేపీ అభ్యర్థి సోనీ పాల్ తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు.
2012లో 272 వార్డులు ఉన్న ఢిల్లీ కార్పొరేషన్ స్థానాలను 250కి తగ్గించారు. మూడు కార్పొరేషన్లను ఎంసీడీలోకి చేర్చి, గతేడాది డిసెంబర్ 4న ఎన్నికలు నిర్వహించారు. వరసగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ను గెలుస్తున్న బీజేపీకి ఈసారి ఆప్ బ్రేక్ వేసి ఘన విజయం సాధించింది. అత్యధిక స్థానాల్లో ఆప్ అభ్యర్థులు విజయం సాధించారు.