మనీష్ సిసోడియా మాట్లాడుతూ.. బజరంగ్ బలి ఆశీస్సులు తనపై ఉన్నాయన్నారు. ఆయన ఆశీర్వాదంతోనే తాను జైలు నుంచి బయటకు వచ్చాను.. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కూడా హనుమాన్ ఆశీస్సులు ఉన్నాయని, తనలానే సీఎం కూడా తొందరలోనే జైలు నుంచి రిలీజ్ అవుతారని సిసోడియా ఆశాభావం వ్యక్తం చేశారు.