తల్లిదండ్రులు బిడ్డలకు కనురెప్పలా కాపాడాలని, బయటకు వెళ్ళినప్పుడు, ఇంట్లో వున్నా వారిపై ఓకన్నేసి వుంచాలని పెద్దలు చెబుతుంటారు. పిల్లలకు ఏ క్షణంలో ఎలాంటి ప్రమాదాలు జరగవచ్చో తెలియదంటూ జాగ్రత్తలు చెబుతుంటారు. అయితే తల్లి దగ్గర అప్పటి వరకు ఆడుకుంటున్నా ఆ చిన్నారి తండ్రి ఒక్క క్షణంలోనే ప్రాణాలు వదలడం ఆతల్లి తల్లడిల్లిన ఈ ఘోరమైన సంఘటన మహారాష్ట్రలోని పూనే లో చోటు చేసుకుంది.
read also: Flipkart : తగ్గెదేలే అంటున్న ఫ్లిప్‌కార్ట్.. ఐఫోన్లపై భారీ ఆఫర్
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర.. పుణెలోని పింప్రీ చించవడ్లోని ఓ వెల్డింగ్ షాపులో మెషిన్ మీద పడి యువన్ అనే ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. కాగా.. యువన్ తన తల్లితో కలిసి కారు వాటర్ సర్వీసింగ్కు వెళ్లాడు. అక్కడే ఆడుకుంటుండగా ఓ ఇనుప యంత్రం తనమీద పడి ఈ ప్రమాదం జరిగింది. అక్కడే కూర్చొని వున్నతల్లి వెంటనే బాలుడి తల్లి ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే యువన్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటన సంబంధించిన దృశ్యాలన్ని సీసీటీవీలో నమోదయ్యాయి. ఈ దృష్యాలను చూసి అందరూ కంటతడిపెడుతున్నారు. అప్పుడే ఆడుకుంటున్న ఆ చిన్నారి కొద్ది క్షణాల్లోనే ప్రాణాలు వదలడంపై ఆతల్లి ఎంతగా తల్లడిల్లి వుంటుందో అంటూ కన్నీటిపర్వంతమయ్యారు.