Delhi: ఢిల్లీలో బాలుడు హత్య.. ఇళ్లపై ‘హిందూ’ పోస్టర్లు కలకలం
- ఢిల్లీలో బాలుడు హత్య
- ఇళ్లపై ‘హిందూ’ పోస్టర్లు కలకలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో బాలుడి(17) హత్య తీవ్ర కలకలం రేపింది. సీలంపూర్‌లో బాలుడిని కొందరు దుండగులు చంపేసి పరారయ్యారు. దీంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పెద్ద ఎత్తున బంధువులు, స్థానికులు గురువారం రాత్రి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా స్థానికులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. హిందువులు వలస వెళ్లిపోతున్నారంటూ రాతలు రాశారు. అంతేకాకుండా ఇళ్లపై కూడా అంటించిన దృశ్యాలు కనిపించాయి. యూపీ సీఎం యోగీ, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సహాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు.. పెద్ద ఎత్తున మోహరించారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Also Read
- Prashant Kishor: ‘కుక్కను, పిల్లిని నిలబెట్టినా గెలుస్తామనుకుంటున్నారు’ బీజేపీపై ప్రశాంత్ కిషోర్ ఘాటు వ్యాఖ్యలు
- Abortion Ruling: గర్భం కొనసాగించాలా? అబార్షన్ చేయించుకోవాలా? ఈ నిర్ణయం పూర్తిగా తల్లిదే.. హైకోర్టు కీలక తీర్పు
- PM Modi Three-Nation Tour: మూడు దేశాల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోడీ.. పూర్తి వివరాలు
- Blue Aadhaar Card: బ్లూ ఆధార్ కార్డుపై కీలక అప్డేట్.. పిల్లల గుర్తింపుకు సంబంధించిన ఈ సేవ ఆ తేదీ వరకు ఫ్రీ..!
హతుడు ముస్లిం వర్గానికి చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. నిందితులు బాధితుడికి తెలిసిన వారేనని పోలీసులు చెబుతున్నారు. దాడి చేసిన వారు మైనర్లా లేకుంటే పెద్దవారా? అనే అంశంపై దర్యాప్తు చేస్తు్న్నారు. నిందితులను గుర్తించేందుకు సీసీకెమెరాలను పరిశీలిస్తున్నారు. ఇక ఇదే అంశంపై ముఖ్యమంత్రి రేఖా గుప్తా స్పందించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. హత్యకు సంబంధించి తాను పోలీస్ కమిషనర్‌తో మాట్లాడానని, నిందితుల పేర్లు వెలుగులోకి వచ్చాయని ముఖ్యమంత్రి ధృవీకరించారు. పోలీసులు తమ పని తాము చేసుకుంటున్నారని.. కుటుంబానికి న్యాయం జరుగుతుందన్నారు. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని సీఎం హామీ ఇచ్చారు.
హత్య వెనుక లేడీ డాన్?
బాధితుడి తల్లి మాట్లాడుతూ.. ఇల్లు అమ్మేసి వెళ్లిపోతున్నామని.. ఇంతలోనే తన కొడుకు హత్యకు గురయ్యాడని వాపోయింది. తన కొడుకుపై వేరే వాళ్లు ద్వేషాన్ని రగిలించారని.. ఇందులో భాగంగానే పాలు తెచ్చేందుకు బయటకు వెళ్లి హత్యకు గురయ్యాడని తెలిపింది. ఇక తండ్రి రాజ్‌బీర్ సింగ్ మాట్లాడుతూ.. తన కొడుకును 4-5 మంది అబ్బాయిలు కత్తితో పొడిచి చంపడం చూసినట్లు తెలిపాడు. ఇప్పటికే చాలా మంది హిందువులు ఇళ్లను అమ్మేసి వెళ్లిపోయారని.. చాలా మంది వెళ్లిపోవాలనే ఇలా చేస్తున్నారని పేర్కొన్నాడు. ఘటనాస్థలిలో జిక్రా అనే అమ్మాయి కూడా కనిపించిందన్నాడు. తన కొడుకుకు ఎవరితోనూ శత్రుత్వం లేకపోయినా.. జిక్రా బెదిరించిందని వాపోయాడు. జిక్రాను లేడీడాన్‌గా పిలుస్తుంటారు. అయితే పోలీసులు విచారించి జిక్రా పాత్ర లేదని వదిలిపెట్టేశారు.
బాలుడికి తల్లిదండ్రులు, ముగ్గురు సోదరులు, సోదరి ఉంది. సీలంపూర్‌లో నివాసం ఉంటున్నారు. గాంధీనగర్‌లోని ఒక బట్టల షాపులో పని చేస్తుంటాడు. గురువారం రాత్రి పాలు కొనేందుకు షాపుకు వెళ్లి హత్యకు గురయ్యాడని పోలీసులు తెలిపారు.
#WATCH | Delhi: A 17-year-old boy was stabbed to death in Seelampur, kin of the victim blocked the road after the incident; security heightened in the area (17/04) https://t.co/7LtDIGr4ZI pic.twitter.com/SFW6R4wepQ
— ANI (@ANI) April 17, 2025
తాజావార్తలు
-
PoK: జులై 9న ఫైనల్ వార్.. పాకిస్థాన్‌కు పీఓకే నేతల లాస్ట్ వార్నింగ్! ఆ రోజు ఏం జరగబోతోంది?
-
Israel: ఖమేనీ అంత్యక్రియల రోజే ఇరాన్‌కు షాక్.. ఇజ్రాయిల్ సంచలన హెచ్చరిక
-
Aakash Chopra: ‘సంజూకు అన్యాయం చేశారు.. మరొకరిపై వేటు వెయ్యాలని చూస్తున్నారా..?’
-
Prashant Kishor: ‘కుక్కను, పిల్లిని నిలబెట్టినా గెలుస్తామనుకుంటున్నారు’ బీజేపీపై ప్రశాంత్ కిషోర్ ఘాటు వ్యాఖ్యలు
-
US-Iran: మరోసారి ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ చర్చలు.. ఎప్పుడంటే..!
ట్రెండింగ్
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్‌లో ఇంగ్లండ్‌ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, 8500mAh బ్యాటరలతో ఎంట్రీ ఇవ్వనున్న Xiaomi 18 Pro Max..!
-
Akriti Agarwal: చాలాసార్లు మోసపోయా.. ప్రతి రూమర్ నిజమే.. పృథ్వీ షా కాబోయే భార్య సంచలన వ్యాఖ్యలు!
-
Beth Mooney History: బెత్ మూనీ చరిత్ర.. అరుదైన డబుల్ రికార్డులు.. ధోనీ, రోహిత్, కోహ్లీలకు సాధ్యం కాలే!