US-Iran: మరోసారి ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ చర్చలు.. ఎప్పుడంటే..!
- మరోసారి ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ చర్చలు
- జూలై 11న చర్చలు జరిగే అవకాశం
- ఖమేనీ అంత్యక్రియల తర్వాత పూర్లి క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇస్లామాబాద్ వేదికగా మరోసారి అమెరికా-ఇరాన్ మధ్య కీలక చర్చలు జరగబోతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ మేరకు అంతర్జాతీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న దౌత్య ప్రయత్నాల్లో భాగంగా ఇస్లామాబాద్‌ను తదుపరి సమావేశానికి అనువైన వేదికగా ఎంపిక చేసినట్లు దౌత్య వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం జూలై 11 తేదీని పరిశీలిస్తున్నప్పటికీ.. ఇరాన్‌లోని తాజా పరిణామాలను బట్టి తుది తేదీ మారే అవకాశం ఉందని సమాచారం.
దౌత్య వర్గాల సమాచారం ప్రకారం.. అమెరికా, ఇరాన్‌కు చెందిన సాంకేతిక బృందాల మధ్య జరిగే తదుపరి సమావేశానికి పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌ను ప్రాధాన్య వేదికగా ఎంపిక చేశారు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా ప్రారంభమైనట్లు పాకిస్థాన్ విదేశాంగ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. “తదుపరి దశ చర్చలు ఇస్లామాబాద్‌లో జరిగే అవకాశం ఉంది. అయితే అవి జూలై 11న జరుగుతాయా? లేక ఆ తర్వాత జరుగుతాయా? అనేది ఇంకా ఖరారు కాలేదు” అని ఆయన తెలిపారు. ఇరు దేశాల షెడ్యూల్‌ను బట్టి తేదీని ఖరారు చేసే ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు.
Also Read
- Israel: ఇజ్రాయిల్ వెళ్లే విమానాల్లో పాక్ పైలట్లు, సిబ్బందిపై నిషేధం..!
- Crude Oil Prices Rise: చమురు ధరలకు మళ్లీ రెక్కలు.. భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా..?
- Saudi Arabia: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు.. హిందూ వ్యక్తికి మరణశిక్ష నుంచి ఊరట..
- Trump: ట్రంప్ ప్రచార సభలో గందరగోళం.. నిరసనకారుడిని చితకబాదిన మద్దతుదారులు
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న దౌత్య ప్రక్రియలో పాకిస్థాన్ కీలక పాత్ర పోషిస్తోందని ఆ దేశ అధికారులు చెబుతున్నారు. వాషింగ్టన్, టెహ్రాన్లతో పాటు సంబంధిత దౌత్య ప్రతినిధులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు పాకిస్థాన్ విదేశాంగ శాఖ పేర్కొంది. ఇటీవల ప్రాంతీయ ఉద్రిక్తతలు తగ్గిన తర్వాత ఏర్పడిన చర్చల వాతావరణాన్ని కొనసాగించేందుకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వం ఉపయోగపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే సమావేశంలో ఇప్పటికీ పరిష్కారం కాని కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇరాన్‌పై అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలు, స్తంభింపజేసిన (Frozen) ఇరాన్ ఆస్తుల విడుదల, ఇరాన్ అణు కార్యక్రమ భవిష్యత్, విస్తృత శాంతి ఒప్పందానికి అవసరమైన దౌత్య చర్యలు వంటి అంశాలు ప్రధాన ఎజెండాగా ఉండే అవకాశముందని దౌత్య వర్గాలు తెలిపాయి.
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీతో పాటు ఇతర ప్రముఖుల అంత్యక్రియలు ప్రస్తుతం కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్ ప్రతినిధి బృందం కూర్పుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. జూలై 9న అంత్యక్రియలు ముగిసిన తర్వాతే ఈ విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే తదుపరి దశ అమెరికా-ఇరాన్ చర్చల తేదీ లేదా వేదికపై ఇప్పటివరకు అమెరికా, ఇరాన్ ప్రభుత్వాలు అధికారిక ప్రకటన చేయలేదు. అలాగే పాకిస్థాన్ కూడా తాము ఆతిథ్యం ఇస్తున్నట్లు అధికారికంగా ధృవీకరించలేదు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇస్లామాబాద్‌నే ప్రాధాన్య వేదికగా పరిగణిస్తున్నట్లు దౌత్య వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సమావేశం పాకిస్థాన్‌లో జరిగితే అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న దౌత్య చర్చల్లో ఇస్లామాబాద్ మరోసారి కీలక పాత్ర పోషించినట్లవుతుంది.
- Tags
- Iran
- Islamabad talks
- Pakistan
- us
తాజావార్తలు
-
e-SPRINTO G1: రూ.లక్షలోపే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క ఛార్జ్‌తో 130 కి.మీ. రేంజ్!
-
Railway Bonus: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్, సామాజిక పింఛన్లకు రూ.53,428 కోట్లు!
-
TDP-Janasena Seat Sharing Talks: సీట్ల లొల్లి.. కూటమి ముందు జనసేన భారీ డిమాండ్..
-
Tollywood: దసరా వార్‌లో నైజాంను క్లీన్ స్వీప్ చేసిన మైత్రీ!
-
Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..