IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
- రెండో టీ20లో టీమిండియా ఓటమి
- సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఆతిథ్య జట్టు
- జట్టు కూర్పుపై టీమ్ మేనేజ్మెంట్ దృష్టి
- మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND Playing XI vs ENG for 3rd T20: ఇంగ్లండ్‌తో మాంచెస్టర్ వేదికగా జరిగిన రెండో టీ20లో నాలుగు వికెట్ల తేడాతో ఓటమిపాలైన టీమిండియా.. సిరీస్‌లో వెనకపడిపోయింది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం సాధించడంతో.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆతిథ్య జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది. కొత్త టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భారత్ ఇప్పటివరకు ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది. దీంతో జట్టు కూర్పుపై టీమ్ మేనేజ్మెంట్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మంగళవారం (జూలై 7) ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగే మూడో టీ20లో తుది జట్టులో పలు మార్పులు జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
రవి బిష్ణోయ్‌పై వేటు:
రెండో టీ20లో లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ నిరాశపరిచాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 60 పరుగులు సమర్పించుకుని.. ఒక్క వికెట్ కూడా తీయలేదు. ముఖ్యంగా 17వ ఓవర్లో రెండు నోబాల్స్ వేయడంతో పాటు మొత్తం 29 పరుగులు ఇవ్వడంతో మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా మారింది. ఆ ఓవర్ తర్వాతే ఇంగ్లండ్ మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యం సాధించింది. ఈ నేపథ్యంలో మూడో టీ20లో బిష్ణోయ్ స్థానంలో మరో స్పిన్నర్‌కు అవకాశం ఇవ్వాలని టీమ్ మేనేజ్మెంట్ ఆలోచిస్తోందట. వాషింగ్టన్ సుందర్ ప్లేయింగ్ 11లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సుందర్ బ్యాటింగ్ కూడా బాగా చేయగలడు. ఇది టీమిండియాకు కలిసొచ్చే అంశం.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
- ICC Rankings: మారిన టీ20, వన్డే ఐసీసీ ర్యాంకింగ్ లిస్ట్.. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ స్థానాలు ఇవే..
- Gautam Gambhir: సంజు శాంసన్ విషయంలో తప్పు చేశా.. ఆ రాత్రి నాకు నిద్ర కూడా పట్టలేదు..
హర్షిత్ రాణా కూడా అవుట్:
యువ పేసర్ హర్షిత్ రాణా కూడా రెండో మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. మూడు ఓవర్లు బౌలింగ్ చేసి 30 పరుగులు ఇచ్చి ఒక వికెట్ మాత్రమే పడగొట్టాడు. అయితే అప్పటికే మ్యాచ్ ఇంగ్లండ్ చేతుల్లోకి వెళ్లిపోయింది. కీలక సమయాల్లో వికెట్లు తీయడంలో విఫలమైన హర్షిత్ స్థానంలో యువ ఫాస్ట్ బౌలర్ ప్రిన్స్ యాదవ్‌కు ఛాన్స్ రానుందని తెలుస్తోంది. ప్రసిద్ కృష్ణ కూడా ఆడే అవకాశాలు లేకపోలేదు.
శివమ్ దూబే అనుమానమే:
ఆల్‌రౌండర్ శివమ్ దూబే మరోసారి బ్యాటింగ్‌లో నిరాశపరిచాడు. ఏడు బంతులు ఎదుర్కొని కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో అతడితో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయించలేదు. దీంతో ఆల్‌రౌండర్‌గా పెద్దగా ప్రభావం చూపడం లేదు. జట్టుకు మరింత సమతుల్యత తీసుకురావాలనే ఉద్దేశంతో సూర్యాంశ్ షెడ్జ్‌కు అవకాశం ఇవ్వాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోందట.
సిరీస్‌లో నిలవాలంటే గెలుపు తప్పనిసరి:
మాంచెస్టర్ టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 190 పరుగులు చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని ఇంగ్లండ్ కేవలం 19 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. జేకబ్ బెతెల్ అజేయంగా 76 పరుగులు చేసి ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో సిరీస్‌లో 1-0తో వెనుకబడిన భారత్‌కు ఇక ప్రతి మ్యాచ్ కీలకంగా మారింది. ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరిగే మూడో టీ20లో విజయం సాధిస్తేనే.. సిరీస్‌లో నిలిచే అవకాశం ఉంటుంది. అందుకే ఆ మ్యాచ్‌లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో కీలక మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
భారత్ తుది జట్టు (అంచనా):
వైభవ్ సూర్యవంశీ
అభిషేక్ శర్మ
ఇషాన్ కిషన్ (కీపర్)
శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్)
తిలక్ వర్మ
సూర్యాంశ్ షెడ్జ్
అక్షర్ పటేల్
వాషింగ్టన్ సుందర్
ప్రిన్స్ యాదవ్
అర్ష్‌దీప్ సింగ్
వరుణ్ చక్రవర్తి
తాజావార్తలు
-
Hanuman Ansh : రూ. 400 కోట్ల దిశగా హనుమాన్ అంశ్ 47వ రోజు దాదాపు రూ. 5 కోట్లు వసూళ్లు
-
Hyderabad Metro: వినాయక భక్తులకు గుడ్ న్యూస్.. నిమజ్జనం వేళ హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ మార్పు.! లాస్ట్ రైలు ఎప్పుడంటే?
-
Kakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
CM CBN Reviews on Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!