దేశ రాజధాని ఢిల్లీలోని సీలంపూర్‌లో జరిగిన బాలుడి హత్య వెనుక లేడీడాన్ జిక్రా హస్తం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఆమెకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో బాలుడి(17) హత్య తీవ్ర కలకలం రేపింది. సీలంపూర్‌లో బాలుడిని కొందరు దుండగులు చంపేసి పరారయ్యారు. దీంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పెద్ద ఎత్తున బంధువులు, స్థానికులు గురువారం రాత్రి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా స్థానికులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు.