PoK: జులై 9న ఫైనల్ వార్.. పాకిస్థాన్‌కు పీఓకే నేతల లాస్ట్ వార్నింగ్! ఆ రోజు ఏం జరగబోతోంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PoK: పాకిస్థాన్ ప్రభుత్వ అణచివేత వైఖరిపై పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. తమ 38 పాయింట్ల డిమాండ్ల ఒప్పందానికి ఒప్పుకోకపోతే జులై 9న ఆఖరి పోరాటానికి దిగుతామని జమ్మూకశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) పాక్ సర్కారును హెచ్చరించింది. ఈ తుది పోరాటంలో పీఓకే ప్రజలతో పాటు ప్రవాస కశ్మీరీలంతా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చింది. పీఓకేలో పాక్ సైన్యం సాగిస్తున్న మానవ హక్కుల ఉల్లంఘనలను, పౌరుల హత్యలను ప్రపంచ దేశాలు గమనించాలని జేఏఏసీ పిలుపునిచ్చింది. జులై 9న పీఓకేలో క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించేందుకు రావాలని ఐరాస (UN) ప్రతినిధులు, ఇస్లామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (OIC), అంతర్జాతీయ మీడియా, మానవ హక్కుల సంఘాలకు బహిరంగ ఆహ్వానం పలికింది. ఇదే సమయంలో డెడ్‌లైన్ ముగిసేవరకు నిరసనకారులు క్రమశిక్షణతో ఉండాలని సూచించింది.
మాకు భారత్ సాయం కావాలి
ఈ ఉద్రిక్తతల నడుమ జేఏఏసీ కీలక నేత సర్దార్ అమన్ ఖాన్‌కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. “మాకు భారత్ సహాయం కావాలి. పీఓకేలో ఆహార పదార్థాలు, మందుల కొరత తీవ్రంగా ఉంది. భారత్ మాకు మానవతా సాయం అందించాలి” అని ఆయన ఆ వీడియోలో అభ్యర్థించారు. పరిస్థితులు ఇంకా దిగజారితే పీఓకే పౌరులు ప్రాణాలు దక్కించుకోవడానికి భారత్‌లోకి వచ్చేలా.. లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC) వెంట సరిహద్దులను తెరవాలని అమన్ ఖాన్ విజ్ఞప్తి చేయడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే సమయంలో పీఓకే ప్రజల నిరసనలను అణచివేయడానికి పాకిస్థాన్ ప్రభుత్వం క్రూరమైన వ్యూహాలను అమలు చేస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆందోళనలకు నేతృత్వం వహిస్తున్న జేఏఏసీని పాక్ సర్కారు ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద నిషేధించింది. ఇప్పటికే 600 మందికి పైగా నాయకులు, కార్యకర్తలను భద్రతా బలగాలు అక్రమంగా అరెస్టు చేశాయి. పీఓకేలోకి వెళ్లే నిత్యావసరాలు, ఆహార పదార్థాలు, అత్యవసర మందుల సరఫరాను నిలిపివేసి పాక్ ప్రభుత్వం అక్కడ ఆర్థిక దిగ్బంధనాన్ని విధించింది.
Also Read
- Skirt: స్కర్ట్ నుంచి హిజాబ్ వరకు.. స్త్రీ శరీరంపై అధికారం ఎవరిది?
- US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
- Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
- India’s UNSC Permanent Seat Bid: భారత్ UNSC శాశ్వత సభ్యత్వానికి రష్యా మద్దతు.. UNGAలో లావ్రోవ్ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?