Aakash Chopra: ‘సంజూకు అన్యాయం చేశారు.. మరొకరిపై వేటు వెయ్యాలని చూస్తున్నారా..?’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్ జట్టులో రజత్ పాటిదార్‌ను చేర్చుకోవాలనే డిమాండ్‌పై మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశారు. వరుసగా రెండు ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ పాటిదార్‌ను టీ20 జట్టులోకి తీసుకురావాలని ఇర్ఫాన్ పఠాన్ వంటి మాజీలు కోరుతుండగా, చోప్రా మాత్రం ప్రాక్టికల్ ప్రశ్నలను లేవనెత్తారు.
ప్రస్తుతం టీమిండియా టాప్-7 బ్యాటింగ్ లైనప్‌లో ఆరుగురు ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉన్నారు. ఈ రైట్-లెఫ్ట్ కాంబినేషన్ లోపం వల్ల జట్టు గత నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట్లో ఓడిపోయింది. దీంతో కుడిచేతి వాటం బ్యాటర్ అయిన పాటిదార్ అవసరం ఉందనే వాదన వినిపిస్తోంది. అయితే, “రజత్‌ను జట్టులోకి తెస్తే, ఎవరిని తీసేస్తారు?” అని ఆకాష్ చోప్రా ప్రశ్నించారు. ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ 2026 ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ సంజూ శాంసన్‌ను కేవలం మూడు మ్యాచ్‌ల్లో ఫ్లాప్ అయ్యాడనే కారణంతో పక్కనబెట్టి, వైభవ్ సూర్యవంశీకి చోటు ఇచ్చారని, ఇది శాంసన్‌కు చేస్తున్న అన్యాయమని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read
ప్రస్తుతం జట్టులో మార్పులు చేయడం అంత సులువు కాదని పేర్కొన్నాడు. వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ప్రస్తుతం నంబర్ 1 టీ20 బ్యాటర్‌గా ఉన్న ఇషాన్ కిషన్ (నంబర్ 3)లను తొలగించే అవకాశం లేదన్నారు. నంబర్ 4లో శ్రేయస్ అయ్యర్, నంబర్ 5లో వైస్ కెప్టెన్ తిలక్ వర్మ ఉన్నారు. కెప్టెన్, వైస్ కెప్టెన్లను మార్చలేమని.. నంబర్ 6లో శివమ్ దూబే స్థానంలో పాటిదార్‌ను ఆడించడం సరైన నిర్ణయం కాకపోవచ్చని పేర్కొన్నాడు.
రజత్ పాటిదార్‌కు ఐపీఎల్‌తో కలిపి 106 టీ20ల్లో 160+ స్ట్రైక్ రేట్‌తో 3,389 పరుగులు ఉన్నప్పటికీ.. ప్రస్తుత సమీకరణాల ప్రకారం అతనికి వెంటనే చోటు దక్కడం కష్టమేనని చోప్రా స్పష్టం చేశారు. అయితే.. భవిష్యత్తులో రజత్‌కు కచ్చితంగా భారత్ తరపున ఆడే అవకాశం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?