Covid-19 Variant: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే భారత్, చైనా, అమెరికా వంటి దేశాల్లో వెలుగులోకి వచ్చిన NB.1.8.1 అనే కొత్త కోవిడ్ వేరియంట్ ఇప్పుడు యునైటెడ్ కింగ్డంలో (UK) కూడా గుర్తించబడింది. ఈ వేరియంట్ కారణంగా చైనాలో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) వెల్లడించింది. ఇకపోతే, శుక్రవారం ఉదయం వరకు భారత్‌లో 5,364 యాక్టివ్ కోవిడ్ కేసులు నమోదయ్యాయి.…
New Covid XEC variant: కొత్త రకం కరోనా వైరస్ ఎక్స్ఈసీ వేగంగా ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందింది. అత్యంత ప్రమాదకరమైన ఎక్స్ఈసీ కోవిడ్ వేరియంట్ పట్ల అలర్టుగా ఉండాలని.. ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని సైంటిస్టులు వార్నింగ్ ఇస్తున్నారు.
Covid-19: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి పీడ ఇంకా పోలేదు. వైరస్ మరోసారి మ్యుటేషన్‌కు గురైందని.. దీని కారణంగా కొత్త వేరియంట్‌లు కనిపిస్తున్నాయని సూచిస్తున్నాయి.
Covid variant JN.1: దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య ఇటీవల కాలంలో పెరుగుతోంది. దీంతో పాటు కోవిడ్ కొత్త వేరియంట్ JN.1 చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా 63 కొత్త వేరియంట్ JN.1 కేసులు నమోదైనట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కేసులన్నీ కూడా ఆరు రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. మొత్తం 63 కేసుల్లో గోవాలో అత్యధికంగా 34 కేసులు నమోదు అవ్వగా.. మహారాష్ట్రలో 9, కర్ణాటకలో 8, కేరళలో 6, తమిళనాడులో 4,…
New Covid Variant: కోవిడ్ కొత్త వేరియంట్ JN.1 మరోసారి ప్రజల్ని భయపెడుతోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 358 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక్క కేరళలోనే 300 కేసులు ఉన్నాయి. భారతదేశంలో ప్రస్తుతం 2669 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలా ఉంటే JN.1 వేరియంట్ పెద్దగా ప్రమాదాన్ని కలిగించని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ దీనికి వేగం వ్యాప్తించే గుణం ఉందని హెచ్చరించారు.
దేశవ్యాప్తంగా ఇటీవల కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, లక్షణాల విషయంలో కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని మేదాంత హాస్పిటల్ వైద్యులు, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చెస్ట్ సర్జరీ ఛైర్మన్ డాక్టర్ అరవింద్ కుమార్ సూచించారు.
XBB 1.16 variant: కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలతో పాటు భారత్‌తోనూ భయానక పరిస్థితులను చూపించింది.. వైరస్ బారిన పడితే చాలు.. అయినవారు కూడా ఆదరించని పరిస్థితులను చూపించింది.. కడసారి చూపుకు కూడా నోచుకోని స్థితికి తీసుకెళ్లింది.. ఇప్పటికే భారత్‌లో ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ రూపంలో కోట్లాది మందిపై ఎటాక్ చేసింది.. లక్షలాది మంది ప్రాణాలు తీసింది.. ప్రస్తుతం దేశంలో కోవిడ్ 19 కొత్త వేరియంట్ ఎక్స్‌బీబీ.1.16 వైరస్‌ను 76 నమూనాల్లో…
Covid variant XBB1.16: దేశంలో మళ్లీ కోవిడ్ కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. 126 రోజలు తర్వాత శనివారం కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపించింది. శనివారం ఏకంగా 800 కన్నా ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. ఇదిలా ఉంటే దేశంలో కొత్తగా కరోనా వేరియంట్ కేసులు కూడా నమోదు అవుతున్నాయి. భారతదేశంలో కొత్త కోవిడ్ వేరియంట్ XBB1.16 కేసుల సంఖ్య 76 నమోదు అయ్యాయని INSACOG డేటా వెల్లడించింది. XBB 1.16 వేరియంట్ మొదటిసారి జనవరిలో కనుగొనబడింది.…
తగ్గినట్టే తగ్గిన కరోనా మళ్లీ పంజా విసురుతోంది.. కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులు మరోసారి ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ఇజ్రాయెల్‌లో మరో కొత్త వేరియంట్‌ను గుర్తించారు. బెన్ గురియోన్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఇద్దరు ప్రయాణీకుల్లో కరోనా కొత్త వేరియంట్ బయటపడినట్లు ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఒమిక్రాన్‌కు చెందిన రెండు సబ్ వేరియంట్‌లు BA.1, BA.2లను కొత్త వేరియంట్ కలిగి ఉన్నట్లు తెలిపింది. కొత్త వేరియంట్ సోకిన ఇద్దరు వ్యక్తులకు జ్వరం, తలనొప్పి, కండరాల బలహీనత వంటి…
కరోనా సెకండ్ వేవ్ తగ్గిపోయింది.. ఇప్పట్లో థర్డ్ వేవ్ ముప్పుకూడా పెద్దగా ఉండకపోవచ్చు అనే అంచనాలు వేశారు.. కానీ, కోవిడ్ కొత్త వేరియంట్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు గుబులు పుట్టిస్తోంది.. పలు దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ బి.1.1.529 కేసులు వెలుగుచూస్తున్నాయి.. సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్.. ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది.. అప్రమత్తమైన బ్రిటన్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, చెక్ రిపబ్లిక్, ఇజ్రాయెల్, సింగపూర్లు సదరన్ఆఫ్రికా దేశాలపై ట్రావెల్బ్యాన్విధించాయి. ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం…