Karnataka Elections: కర్ణాటక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. తాజాగా ఈ రోజు బీజేపీ తన తొలివిడత అభ్యర్థులు జాబితాను ప్రకటించింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటకలో తొలివిడతగా బీజేపీ 189 మంది అభ్యర్థులను ప్రకటించింది. తొలివిడతలో భారీగా ఎమ్మెల్యేలను తొలగించింది. ఏకంగా 52 మంది కొత్తవారికి అవకాశం ఇచ్చింది. రెండో జాబితా త్వరలోనే వస్తుందని సీఎం బసవరాజ్ బొమ్మై తెలిపారు. గత వారం చివర్లో బీజేపీ అగ్రనాయకులు జేపీ నడ్డా ఇంటిలో భేటీ అయి…