KC Venugopal: కాంగ్రెస్లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
- కాంగ్రెస్లో టీఎంసీ విలీనంపై కేసీ.వేణుగోపాల్ కీలక వ్యాఖ్యలు
- సోనియా-మమత భేటీపై క్లారిటీ
- 2-3 నెలల్లో ప్రజా పోరాటం చేస్తున్నట్లు ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్లో తృణమూల్ కాంగ్రెస్ విలీనంపై వస్తున్న వార్తలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ.వేణుగోపాల్ స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. విలీనంపై వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అవాస్తవం అని కొట్టిపారేశారు. మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలిసిన మాట వాస్తవమే కానీ.. అది ఒక సాధారణ సమావేశం మాత్రమేనని స్పష్టం చేశారు. విలీనం గురించి ఎలాంటి చర్చలు జరగలేదని పేర్కొన్నారు.
‘‘రాబోయే 2-3 నెలల్లో మేము జాతీయ స్థాయిలోనే కాకుండా.. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కూడా ఒక ఉద్యమాన్ని చేపట్టబోతున్నాం. ప్రజలు ఎక్కడైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో.. అక్కడ కాంగ్రెస్ వారి ఆవేదనలో భాగస్వామి అవుతుంది. వారి తరఫున పోరాడుతుంది.’’ అని అన్నారు.
Also Read
- PM Modi: ‘‘వారి గ్లాస్ ఎప్పుడూ సగం ఖాళీనే’’.. GDPపై మోదీ ఘాటు వ్యాఖ్యలు
- PM Modi: ఎస్ఆర్సీసీ నుంచి బయటకొచ్చినోళ్లు గొప్పోళ్లు కాకపోవచ్చు.. కానీ..!
- Kangana Ranaut: అధికారులపై కంగనా రనౌత్ రుసరుసలు.. ఏం చేశారంటే..!
- Ketan Agrawal Case: కేతన్ అగర్వాల్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చేతన్, సియాల తర్వాత మరొకరి అరెస్ట్..
‘‘ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన కార్యదర్శులు, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్లు, పీసీసీ (PCC) అధ్యక్షులతో మూడు గంటల పాటు సమావేశం జరిగింది. మధ్యప్రదేశ్, జార్ఖండ్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు ప్రజాస్వామ్యానికి ఆందోళనకరమైనవి. మధ్యప్రదేశ్లో మీనాక్షి నటరాజన్ నామినేషన్ను తిరస్కరించిన అంశం దీనికి ఒక ఉదాహరణ. కోర్టు పంపిన ఒక నోటీసును వెల్లడించలేదన్న కారణంతో ఆమె నామినేషన్ను తిరస్కరించారు. వాస్తవానికి ఆమెపై ఎలాంటి క్రిమినల్ కేసు, ఎఫ్ఐఆర్ (FIR) లేదా ఛార్జ్ షీట్ నమోదు కాలేదు. మరోవైపు జార్ఖండ్లో బీజేపీ మద్దతు ఉన్న ఒక కార్పొరేట్ అభ్యర్థి, కనీసం తన పేరును కూడా సరైన కాలమ్లో నమోదు చేయనప్పటికీ.. రిటర్నింగ్ అధికారి నామినేషన్ను ఆమోదించారు… ఇది ప్రజాస్వామ్య దుస్థితిని తెలియజేస్తోంది… ఈ రోజు జరిగిన సమావేశంలో ఈ అంశంపై కూలంకషంగా చర్చించాము, దీనిపై మేము రాజకీయంగా పోరాడుతాము..’’ అని పేర్కొన్నారు.
#WATCH | Delhi | Congress General Secretary (organisation) KC Venugopal says, "In the coming 2-3 months, we will have a national agitation, even on state and district level… Wherever people are facing difficulties, Congress will share the sentiments with them and fight for… pic.twitter.com/fiWBkWaB3Q
— ANI (@ANI) June 11, 2026
#WATCH | Delhi | Congress General Secretary (organisation) KC Venugopal says, "Today we had a 3-hour-long meeting of General Secretaries, In-Charges and PCC President of the Nation. Basically, you know the latest situation, which happened in Madhya Pradesh and Jharkhand, is a… pic.twitter.com/4767C6RUDb
— ANI (@ANI) June 11, 2026
#WATCH | Delhi | On reports of a possible Congress-TMC merger, Congress General Secretary (organisation) KC Venugopal says, "These are totally baseless rumours. Mamata Banerjee and Abhishek Banerjee met Sonia Gandhi and Rahul Gandhi, but it was a routine discussion as they (TMC)… pic.twitter.com/kOrSTPve5S
— ANI (@ANI) June 11, 2026
తాజావార్తలు
-
INDW Vs PAKW: కుప్పకూలిన పాకిస్థాన్.. 55 పరుగులకే ఆలౌట్..
-
PM Modi: ‘‘వారి గ్లాస్ ఎప్పుడూ సగం ఖాళీనే’’.. GDPపై మోదీ ఘాటు వ్యాఖ్యలు
-
CM Revanth Reddy : సిరిసిల్ల, సిద్దిపేట గడ్డమీద మూడు రంగుల జెండా ఎగరేస్తాం
-
HYDRAA : గణేష్ నిమజ్జనాలపై ఫేక్ ప్రచారం.. రంగనాథ్ క్లారిటీ..!
-
PM Modi: ఎస్ఆర్సీసీ నుంచి బయటకొచ్చినోళ్లు గొప్పోళ్లు కాకపోవచ్చు.. కానీ..!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!