Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
- అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్
- పాఠశాలలో నగదు, కండోమ్స్, మద్యం బాటిల్ కలకలం
- విచారణకు ఆదేశించిన అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్‌లోని ఒక పాఠశాల అసాంఘిక శక్తులకు అడ్డగా మారింది. ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఉన్న ఓ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో కోటి రూపాయల నగదు, కండోమ్స్, మద్యం బాటిల్ లభించడం తీవ్ర సంచలనం రేపింది. ఈ ఘటనతో విద్యాసంస్థలో అసలు ఏం జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంచరపారా ప్రాంతంలోని హార్నెట్ స్కూల్ ఈ వివాదానికి కేంద్రంగా మారింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. పాఠశాల ఆవరణలోని ఒక గదిలో భారీ మొత్తంలో నగదు, కండోమ్స్, మద్యం బాటిల్ గుర్తించారు. ఆ గది సెమీ-ఫర్నిష్డ్‌గా ఉండటమే కాకుండా బెడ్రూమ్ను తలపించే విధంగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆ గదిని ఏ ప్రయోజనం కోసం ఉపయోగించారనే అంశంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వ్యవహారంపై పాఠశాల యాజమాన్యం పూర్తిగా బాధ్యతను నిరాకరించింది. స్కూల్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. పాఠశాల ఆవరణలో అలాంటి వస్తువులు ఉన్న విషయం తనకు తెలియదని, నగదు లేదా అభ్యంతరకర వస్తువులతో యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యం అంతర్గత విచారణ ప్రారంభించింది. ఆ వస్తువులు అక్కడికి ఎలా వచ్చాయి? ఎవరు తీసుకొచ్చారు? అనే అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు.
Also Read
- IIT Bombay Student:పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆ*త్మహ*త్య.. క్యాంపస్‌లో నిరసనలు
- iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
- Sugar Price: పండుగల వేళ సామాన్యులకు తీపి కబురు.. కేంద్రం మరో కీలక నిర్ణయం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
ఇదిలా ఉండగా.. ఈ ఘటన రాజకీయ దుమారం కూడా రేపింది. విద్యాసంస్థల పర్యవేక్షణలో ప్రభుత్వం విఫలమైందంటూ ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోవైపు పూర్తి విచారణ అనంతరం స్పందిస్తామని అధికార పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఇటీవలి కాలంలో పశ్చిమ బెంగాల్లో విద్యాసంస్థలకు సంబంధించిన అవకతవకలు, నియామక కుంభకోణాలు, యాజమాన్య లోపాలపై పలు వివాదాలు వెలుగుచూసిన నేపథ్యంలో ఈ ఘటన మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ వ్యవహారంపై అధికారులు త్వరలో అధికారిక తనిఖీలు నిర్వహించనున్నారు. సీసీటీవీ ఫుటేజ్, సిబ్బంది ప్రవేశ రికార్డులు, పరిపాలనా పత్రాలను పరిశీలించి బాధ్యులను గుర్తించే ప్రయత్నం చేయనున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు ఏదైనా నేర కార్యకలాపాలతో సంబంధం ఉందా అనే విషయంపై స్పష్టత లేదు. ఇప్పటివరకు ఎలాంటి అరెస్టులు జరిగినట్లు అధికారులు ధృవీకరించలేదు. అయితే ఈ ఘటన ప్రజాగ్రహాన్ని రేకెత్తించింది. ఇక ఒక బీజేపీ నాయకుడు మాట్లాడుతూ.. ‘‘టీఎంసీ పశ్చిమ బెంగాల్‌కు శాపం… నాకు సిగ్గుగా ఉంది.’’ అని అన్నారు.
West Bengal: Kanchrapara Harnett English Medium School Acting Principal Bikash Chandra Pal lodged a complaint against four individuals for embezzlement of school funds. Upon opening the vault, a large amount of unaccounted money was found. ₹1.77 crore was seized. A case has been… pic.twitter.com/hGTJ6ltN7D
— IANS (@ians_india) June 11, 2026
- Tags
- condoms
- Liquor
- School
- West Bengal
తాజావార్తలు
-
Sigma Trailer: సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ వచ్చేసింది.. రూ.500 కోట్ల రాకెట్‌తో హీరో ఫైట్!
-
IIT Bombay Student:పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆ*త్మహ*త్య.. క్యాంపస్‌లో నిరసనలు
-
BCCI: కోచ్‌గా అతడు తాత్కాలికమే.. పనితీరు నచ్చితేనే టీమిండియాలో ఉంటాడు!
-
Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
-
TRAI Tightens Spam Call Rules:స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ కఠిన నిబంధనలు.. AIతో ఫేక్ నంబర్ల గుర్తింపు, భారీ జరిమానాలు!
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!