Two Trains: ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో గురువారం భారీ రైలు ప్రమాదం తృటిలో తప్పింది. సిగ్నలింగ్ లోపమో లేదా మానవ తప్పిదమో తెలియదు కానీ, ఒకే రైల్వే ట్రాక్‌పైకి రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చాయి. భువనేశ్వర్‌లోని జార్పాడా వంతెన సమీపంలో జూన్ 11న జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. లోకో పైలట్లు, రైల్వే సిబ్బంది సమయస్ఫూర్తితో అప్రమత్తం కావడంతో ఒకే లైన్‌పై వస్తున్న ఆ రెండు రైళ్లు కొద్దిపాటి దూరంలోనే ఆగిపోయాయి. క్షణం ఆలస్యమైనా ఊహించని రీతిలో భారీ విపత్తు సంభవించి ఉండేదని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు.
ప్రయాణికులు లేకపోవడంతో తప్పిన ముప్పు..
సాధారణంగా ఒకే ట్రాక్‌పైకి రెండు రైళ్లు రావడం అనేది అత్యంత ప్రమాదకరమైన విషయం. అయితే, ఈ ఘటనలో ఒక పెద్ద ఊరట లభించింది. ఎదురెదురుగా వచ్చిన ఆ రెండు రైళ్లు ప్రయాణికులతో వెళ్తున్నవి కావు. అవి కేవలం ఖాళీ బోగీలతో ప్రయాణిస్తున్న ‘ఎంప్టీ ట్రైన్ రేక్స్’ . ఒకవేళ అవి గనుక ప్యాసింజర్ లేదా ఎక్స్‌ప్రెస్ రైళ్లు అయి ఉంటే, ఈ పాటికి వందలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. రెండు రైళ్లలోనూ ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం లేదా ఎవరికీ గాయాలు కాకుండానే ఈ గండం గడిచిపోయింది.
Also Read
- Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
- Iran-UAE: ఇరాన్ విమానాలకు యూఏఈ షాక్.. అన్ని విమానాలు నిలిపివేత.. కారణమిదే!
- Rahul Gandhi: ఇందిరా ఓడిపోయింది, బీజేపీ ఎందుకు ఓడిపోవడం లేదు.
- Air India Offer: ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్.. విమాన ఛార్జీలపై 10 శాతం డిస్కౌంట్..
భయాందోళనలో స్థానికులు..
రెండు రైళ్లు ఎదురెదురుగా నిలిచి ఉండటాన్ని గమనించిన పరిసర ప్రాంతాల ప్రజలు, ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ఎలా వస్తాయంటూ రైల్వే నిర్వహణ తీరుపై మండిపడ్డారు. ఈ సమాచారం అందిన వెంటనే ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
ఈ అసాధారణ ఘటన కారణంగా ఆ మార్గంలో సాధారణ రైలు రాకపోకలకు పెద్దగా అంతరాయం కలగలేదని తూర్పు తీర రైల్వే అధికారులు స్పష్టం చేశారు. అయితే, అసలు ఈ పొరపాటు ఎక్కడ జరిగింది? స్టేషన్ మాస్టర్ల మధ్య కమ్యూనికేషన్ లోపమా? లేక సిగ్నలింగ్ వ్యవస్థ వైఫల్యమా? అనే కోణంలో ఉన్నత స్థాయి దర్యాప్తునకు అధికారులు ఆదేశించారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏది ఏమైనప్పటికీ, ఒక పెద్ద ప్రమాదం తప్పడంతో అటు రైల్వే అధికారులు, ఇటు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
తాజావార్తలు
-
Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
-
Iran-UAE: ఇరాన్ విమానాలకు యూఏఈ షాక్.. అన్ని విమానాలు నిలిపివేత.. కారణమిదే!
-
Raghava Lawrence: సూర్య, విక్రమ్లకే సాధ్యం కాని సాహసం.. లారెన్స్ చేతులెత్తేస్తాడా? లేక చరిత్ర తిరగరాస్తాడా?
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో షీ టీమ్స్ ఫుల్ ఫోకస్.. 1,100 కేసులు.!
-
Rahul Gandhi: ఇందిరా ఓడిపోయింది, బీజేపీ ఎందుకు ఓడిపోవడం లేదు.
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!