Tamil Nadu: తమిళనాడులో విషాదం చోటు చోటు చేసుకుంది. సెప్టిక్ ట్యాంక్ ముగ్గురి ప్రాణాలు తీసింది. తమిళనాడు కడలూరులోని శ్రీముష్టం గ్రామ సమీపంలో కొత్తగా నిర్మించిన సెప్టిక్ ట్యాంక్ పై ప్యాచ్ ఆప్ వర్క్ చేస్తున్న ముగ్గురు కార్మికులు విషవాయువులను పీల్చడం వల్ల చనిపోయారు. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో కృష్ణమూర్తి (40), బాలచంద్రన్ (32), శక్తివేల్ (22) అనే ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. కృష్ణమూర్తి ఇంటి యజమాని కాగా, మృతులు ఇద్దరు అతని బంధువులు.
Read Also: Badruddin Ajmal: బీజేపీని ఓడించేందుకు త్యాగానికి సిద్ధం.. విపక్షాల ఐక్యతకు మద్దతు
కృష్ణమూర్తి తన కొత్త ఇంటికి సంబంధించి సెప్టిక్ ట్యాంక్ నిర్మిస్తున్నారని, మిగిలిన ఇద్దరు ఆయన బంధువులని, ముగ్గురూ కలిసి సెప్టిక్ ట్యాంక్ ప్యాచ్ వర్క్ చేస్తుండగా, విషవాయువులు లీక్ అయి చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్ 174 కింద కేసు నమోదు అయింది. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.